Harishshankar: ‘షాక్’ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ఆ తర్వాత ‘మిరపకాయ్’ మూవీతో మాస్ మహారాజాకి భారీ కమర్షియల్ హిట్ ఇచ్చాడు. దీని తర్వాత టాలీవుడ్ లో హరీష్ శంకర్ బాగా పాపులర్ అయ్యాడు. ‘గబ్బర్ సింగ్’, ‘దువ్వాడ జగన్నాధం’, ‘గద్దలకొండ గణేశ్’.. లాంటి సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా మారాడు. ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో హీరోయిన్‌గా శ్రీలీల కనిపించబోతుంది. అయితే, పవన్ కళ్యాణ్ రాజకీయాలలో బిజీగా ఉన్న కారణంగా కొన్ని నెలలు ఉస్తాద్ కి బ్రేక్ ఇచ్చారట. దాంతో ఈ గ్యాప్ లో హరీష్ మరో ప్రాజెక్ట్ ని టేకప్ చేశాడు. మరోసారి రవితేజతో సినిమా చేస్తున్నట్టుగా ఇటీవల కన్‌ఫర్మ్ చేశాడు. బాలీవుడ్ లో అజయ్ దేవగన్, ఇలియానా జంటగా నటించిన ‘రైడ్’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది.
అయితే, ఈ సినిమా కోసం మేకర్స్ ఇద్దరు హీరోయిన్స్ ని అనుకుంటే వారు రవితేజ సరసన నటించడానికి నో చెప్పినట్టు సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ వైరల్ అవుతున్నాయి. దాంతో స్వయంగా హరీష్ శంకర్ క్లారిటీ ఇచ్చాడు. ఇప్పటివరకూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అవాస్తవం అన్నాడు. మీనాక్షి చౌదరీ, ‘సలార్’ ఫేం త్రిప్తి లను అనుకున్న మాట అబద్దం అన్నారు.
ఈ సినిమా కాస్టింగ్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిందని, శృతి హాసన్ లేదా పూజా హెగ్డేలలో ఒకరు రవితేజ సరసన నటించబోతున్నారని వారిలో ఎవరు ఫైనల్ అవుతారో త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నట్టుగా హరీష్ శంకర్ వెల్లడించారు. ఆయన ఈ విధంగా క్లారిటీ ఇచ్చాక ఇంకో కామెంట్ వినిపిస్తోంది. హరీష్ పూజా హెగ్డేని వదిలేలా లేడని. అవును గతంలో కూడా ఇదే టాక్ వినిపించింది. ఏదేమైనా రవితేజ సినిమాలో హీరోయిన్ గురించి ఓ క్లారిటీ అయితే వచ్చేసింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.