Prabhas Salaar : సలార్ ఫస్ట్ టికెట్ ఎవరు కొన్నారో తెలుసా?

Prabhas Salaar : ప్రభాస్ సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు ఫ్యాన్స్ లో ఓ కొత్త ఉత్సాహం వస్తుంది. అసలే ఫ్లాపులతో అప్సెట్ లో ఉన్న అభిమానులు ఎప్పుడెప్పుడా అని కోటి కళ్ళతో ప్రభాస్ నటించిన సలార్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన సలార్ మూవీ డిసెంబర్ 22న థియేటర్స్ లోకి గ్రాండ్ గారిలీజ్ కాబోతోంది. ప్రభాస్ కి జోడీగా ఈ మూవీలో శృతి హాసన్ కనిపించునుంది. స్టార్ హీరో పృథ్వీరాజ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సలార్ మొదటి భాగం ఇద్దరు స్నేహితుల మధ్య నడిచే కథ అని ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో ప్రశాంత్ నీల్ క్లారిటీ ఇచ్చేశారు. రీసెంట్ గా రిలీజైన సూరిడే సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.

prabhas-salaar-tollywood-star-director-bought-salaar-first-ticket

తన స్నేహితుడిని రాజును చేయడం కోసం ప్రభాస్ అలియాస్ దేవా ఎలాంటి యుద్ధం చేశాడు అనేది ఈ స్టోరీ లో చూపించబోతున్నారు ప్రశాంత్ నీల్. ఇదిలా ఉంటే రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ టీమ్ ప్రమోషన్స్ మొదలుపెట్టేసింది. ప్రమోషన్ లో భాగంగా ఇప్పటికే ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ ని దర్శకధీరుడు రాజమౌళి ఇంటర్వ్యూ చేశారు. ఈ వీడియోని విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.

prabhas-salaar-tollywood-star-director-bought-salaar-first-ticket

గంటన్నర పాటు ఉన్న ఈ వీడియోలో జక్కన్న ప్రభాస్ తో పాటు మిగిలిన టీమ్ మెంబర్స్ ను సినిమాకు సంబంధించిన విషయాలు అడిగినట్లు తెలుస్తోంది. అంతే కాదు ఇక ఈ ఇంటర్వ్యూలోనే సలార్ సినిమా ఫస్ట్ టికెట్ ని రాజమౌళి కొన్నారట . నైజాం డిస్టిబ్యూటర్ ఉన్న మైత్రీ ప్రొడ్యూసర్ నుంచి తొలి టికెట్ ని రాజమౌళి కొనుగోలు చేశారు. ఈ విజువల్స్ ని ఈ వీడియోలో చూపించనున్నారట. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ ఫైనల్ అవుట్ ఫుట్ ని రెడీ చేస్తున్నారని సమాచారం. అది పూర్తి కాగానే సోమవారం ఈ ఇంటర్వ్యూ ని రిలీజ్ చేసే ప్లాన్ చేశారు.

prabhas-salaar-tollywood-star-director-bought-salaar-first-ticket

ఈ ఇంటర్వ్యూని అన్ని మీడియా ఛానల్స్ కి డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. దీంతో మూవీపై హైప్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దర్శకధీరుడు జక్కన్న ప్రమోషన్స్ లో దిగాడంటే సినిమాకి ఆటోమేటిక్ గా క్రేజ్ వచ్చినట్లే. ఈ ప్రభావం ఓపెనింగ్ డే కలెక్షన్స్ మీద ఉండనుంది. కేజీఎఫ్ సిరీస్ మీద కూడా జక్కన్న హ్యాండ్ పడిన తర్వాత పాన్ ఇండియా లెవల్ లో క్రేజ్ వచ్చింది. ఇప్పుడు సలార్ ప్రొమోషన్స్ లోనూ రాజమౌళి హ్యాండ్ పడింది. ఈ ఇంటర్వ్యూతోను ప్రభాస్ ఫ్యాన్స్ లో కొత్త ఊపు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని సినీ ఎనలిస్టులు అంటున్నారు.

Sri Aruna Sri

Recent Posts

Gut Health: రాత్రి తిన్న వెంటనే బెడ్ ఎక్కుతున్నారా… ఇబ్బందులలో పడినట్టే?

Gut Health: సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతీ రోజు వ్యాయామం చేయటం ఎంతో మంచిదే అయితే ఇది ఉరుకుల…

8 hours ago

Lord Shiva: 100 శివరాత్రులకు సమానమైన సోమవారం.. శివయ్యని ఇలా పూజిస్తే చాలు..

Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ…

10 hours ago

AP POLITICS: టీడీపీలో ఉన్న ‘ఆ’ పవర్ జనసేనలో కరువైందా..?

AP POLITICS: రాజకీయాల్లో వ్యూహాలు ఎంత ముఖ్యమో.. ప్రత్యర్థుల విమర్శలను తిప్పికొట్టే కౌంటర్ అటాక్ కూడా అంతే ముఖ్యం. ప్రస్తుతం…

2 days ago

Telangana: కాంగ్రెస్‌లో అసంతృప్తి.. రేవంత్‌కు కొండా త‌ల‌నొప్పి..!

Telangana: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో అంతర్గత సెగలు మళ్లీ మొదలయ్యాయి. పాలనపై పట్టు పెంచుకునే పనిలో ఉన్న సీఎం రేవంత్…

4 days ago

AP POLITICS: భూమా వ‌ర్సెస్ గంగుల‌.. ఆళ్లగడ్డలో హెయిర్ పాలిటిక్స్‌..!

AP POLITICS: ఆళ్లగడ్డ అనగానే ఒకప్పుడు ఫ్యాక్షన్ పాలిటిక్స్ గుర్తొచ్చేవి. కానీ, ఇప్పుడు అక్కడ రూట్ మారింది. సరికొత్తగా ‘హెయిర్…

4 days ago

AP NEWS: మోదీ మెచ్చిన ఫ్యామిలీ.. ఇప్పుడు జ‌న‌సేన‌లోకి..!

AP NEWS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన పార్టీ సరికొత్త ఊపుతో దూసుకుపోతోంది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం తర్వాత, డిప్యూటీ…

4 days ago

This website uses cookies.