Pooja Hegde : పూజా హెగ్డేను స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ వదలడం లేదని ప్రస్తుతం సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. దీనికి కారణం ఇటీవల ఆయన ఈ బ్యూటీని కలిసి కొత్త ప్రాజెక్ట్ గురించి చర్చలు జరపడమే. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో ఒకేసారి తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయమైన పూజా, ఈ రెండు సినిమాలతో ఫ్లాప్‌నే చూసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో హృతిక్ రోషన్ సరసన మొదటిసారి నటించింది. ఈ సినిమా కూడా అక్కడ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇలా కెరీర్ ప్రారంభంలోనే పూజా హెగ్డే నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపవడంతో ఇక హీరోయిన్‌గా కెరీర్ కష్టమే అనుకుంది. కానీ, హరీష్ శంకర్ అవకాశం ఇస్తాడని..ఈరోజు పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ తెచ్చుకుంటానని ఊహించి ఉండదు. దువ్వాడ జగన్నాథం సినిమాతో మళ్ళీ తెలుగులో ఎంట్రీ ఇచ్చిన పూజా హెగ్డే హిట్స్, ఫ్లాప్స్ పక్కన పెడితే ఇక్కడ పాన్ ఇండియా స్టార్‌గా వెలుగుతోంది.
Pooja Hegde : పూజా హెగ్డే నటిస్తుందని ప్రచారం జరిగింది.
ఒకవైపు తమిళ సినిమాలు..ఇంకో వైపు తెలుగు సినిమాలు..అటువైపు బాలీవుడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే, పూజా మీద దర్శకుడు హరీష్ శంకర్‌కి ప్రత్యేకమైన అభిమానం ఉందని చాలా సందర్భాలలో ప్రూవ్ అయింది. అందుకే, ఆయన ఎక్కువ సినిమాలు ఆమెతోనే చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్ సినిమాను తీయబోతున్నట్టు అధికారిక ప్రకటన, పోస్టర్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తుందని ప్రచారం జరిగింది. కానీ, ఆ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇదే కాంబినేషన్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ రూపొందబోతుంది. ఈ ప్రాజెక్ట్ కోసమే తాజాగా హరీష్ శంకర్ పూజా హెగ్డేను కలిశాడట. మొత్తానికి హరీష్.. బుట్టబొమ్మను వదలడం లేదని తెలుస్తోంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.