Categories: LatestNewsPolitics

Chandrababu: పోలీసులకి వార్నింగ్ ఇస్తున్న చంద్రబాబు, నారా లోకేష్

Chandrababu: ఏపీలో ప్రస్తుతం అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ప్రతీకార రాజకీయాలు నడుస్తున్నాయి అనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్ష పార్టీలని, ముఖ్యంగా తెలుగు దేశం పార్టీ చేపట్టే ప్రజా సంబంధ కార్యక్రమాలని చట్టాన్ని ఉపయోగించుకుని అడ్డుకుంటుంది. ఇక ప్రతిపక్ష టీడీపీ కూడా తగ్గేది లే అనే విధంగా అధికార పార్టీపై మాటలతో రెచ్చిపోతుంది. అలాగే చట్టంతో మమ్మల్ని అడ్డుకుంటే ఆ చట్టాన్ని అతిక్రమించి అయిన ప్రజలలోకి వెళ్తాం అంటూ టీడీపీ రాజకీయాలు చేస్తుంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నారా లోకేష్ చేస్తున్న పాదయాత్రకి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు అని టీడీపీ  ప్రధానంగా చెప్పే మాట.

chandrababu-serious-warning-to-police

అయితే చట్టానికి లోబడి తమ నిర్ణయాలు ఉంటాయని, ప్రజలకి ఆటంకం కలిగించే వేటినైనా ప్రభుత్వం అడ్డుకుంటుంది అంటూ అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ నేపధ్యంలో నారా లోకేష్ ఇప్పటికే పోలీసులకి నేరుగా వార్నింగ్ ఇస్తున్నారు. తాము అధికారంలోకి రాగానే వైసీపీకి తొత్తులుగా మారిన పోలీసు అధికారులని గుర్తించి వారికి తాము ఏంటి అనేది చూపిస్తామని హెచ్చరిస్తున్నారు. అలాగే జగన్ రెడ్డికి కూడా భయం అంటే ఏంటో చూపిస్తానని, వైసీపీ నేతలు రోడ్ల మీద తిరగకుండా చేస్తానని వార్నింగ్ ఇస్తున్నారు.

ఇక చంద్రబాబు నాయుడు కూడా సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కూడా కాస్తా ప్రతీకార ధోరణిలోనే వ్యాఖ్యలు చేస్తూ ఉండటం ఇప్పుడు రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. అధికారంలోకి వచ్చిన వెంటనే పోలీసులు అందరిని బొక్కలో వేస్తాం అంటూ కాస్తా తీవ్రంగానే హెచ్చరించారు. అనపర్తి నియోజకవర్గంలో రోడ్ షో, సభకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకోవడంతో చంద్రబాబు పాధయాత్ర చేశారు. అయితే పాదయాత్రని అడ్డుకోవడానికి పవర్ కట్ చేశారు. ఈ పరిణామాల నేపధ్యంలో చంద్రబాబు పోలీసులకి తీవ్రంగా హెచ్చరికలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Varalakshmi

Recent Posts

Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగుతున్నారా? వీళ్లు మాత్రం అసలు తాగకండి!

Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…

16 hours ago

Tirumala: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్.. ఇకపై  క్యూ లైన్ లు ఉండవు.. క్షణాలలోనే ప్రసాదం!

Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది  భక్తుల స్వామి…

16 hours ago

Coconut Water: కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి మంచిదే..కానీ వీళ్లకు మాత్రం కాదండోయ్!

Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…

2 days ago

Pushpayagam Seva Tickets:  శ్రీవారి భక్తులు అలర్ట్.. ఆగస్టు 21 న పుష్పయాగం టిక్కెట్లు విడుదల!

Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…

2 days ago

Papaya: బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే కానీ వీళ్ళు మాత్రం అస్సలు తినొద్దు తెలుసా?

Papaya: మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహార పదార్థాలతో పాటు పండ్లు కూడా ఎంతో కీలకపాత్ర వహిస్తాయి.…

3 days ago

Sravana Masam: శ్రావణ మాసంలోనే పాములు ఎందుకు కనిపిస్తాయి? దీని వెనుక ఉన్న రహస్యం ఇదే?

Sravana Masam: మన తెలుగు క్యాలెండర్ ప్రకారం ఉన్న 12 నెలలకు ఎంతో మంచి ప్రాధాన్యత ఉంది. ఆషాడ మాసం…

3 days ago

This website uses cookies.