Harihara Veeramallu : మేకప్ మెన్ గా కెరీర్ ను ప్రారంభించి నేడు నిర్మాతగా ఎదిగారు ఎ ఎం రత్నం. సూర్య మూవీస్ బ్యానర్ లో అనేక చిత్రాలను నిర్మించి టాప్ నిర్మాతల్లో ఒకరిగా స్థానం దక్కించుకున్నారు. తన కెరీర్ లో గెలుపు ఓటములు రెండిటిని చూసిన రత్నం ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరిహర వీరమల్లు చిత్రానికి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. భారీ బడ్జెట్ రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ ఎ ఎం రత్నం పుట్టినరోజు కావడంతో మూవీ యూనిట్ హరిహర వీరమల్లు షూటింగ్ సందర్భంగా తీసిన ఆయన పిక్స్ ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసి స్పెషల్ విషెస్ ను తెలిపింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్నాయి. పవన్ లుక్స్ ను చూసి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
ఈ పిక్ లో సీన్ కు రెడీ అయిన పవన్ కళ్యాణ్ పక్కన ఎ ఎం రత్నం కూర్చుని ఆయనతో సరదాగా ముచ్చటించారు. సరదాగా నవ్వుతున్నప్పుడు తీసిన క్యాండిడ్ పిక్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ రకంగా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ లుక్ ను రివీల్ చేసింది టీం.
ఆరణి మునిరత్నం సొంతూరు నెల్లూరు జిల్లా. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఇష్టం. ఎలాగైనా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలనుకున్నారు. సాధారణ మేకప్ మెన్ గా తన కెరీర్ ని ప్రారంభించారు. విజయశాంతి పర్సనల్ మేకప్ మ్యాన్ గా పని చేయడంతో రత్నం విజయశాంతి దగ్గరకు వచ్చే నిర్మాతల తో పరిచయం పెంచుకొని క్రమంగా నిర్మాతగా మారారు. ఆ టైంలో విజయశాంతి కూడా ప్రోత్సహించడంతో ఆయన దశ తిరిగింది. సూర్య మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేసి తెలుగు తమిళ భాషల్లో అనేక చిత్రాలను నిర్మించారు. ప్రముఖ నిర్మాతగా మారారు. ధర్మ యుద్ధం, కర్తవ్యం,పెద్దరికం, సంకల్పం, ప్రేమలేఖ, జెంటిల్మెన్, ప్రేమికుడు, భారతీయుడు వంటి అనేక సినిమాల నిర్మించి స్టార్ నిర్మాతగా గుర్తింపును సంపాదించుకున్నారు.
పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం వీరమల్లు. 200 కోట్ల రూపాయలతో రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తుండగా, నిధి అగర్వాల్, బాబి డియోల్, నర్గీస్ ఫక్రి వంటి తారలు కీలకపాత్రలో కనిపించనున్నారు.