HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఉన్న సంగతి తెలిసిందే. వినోదాయ సీతమ్ మూవీ షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ చేయగా తాజాగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ షూటింగ్ స్టార్ట్ చేశారు. ఈ మూవీ కూడా రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుందని టాక్. మేనెలలో సుజిత్ దర్శకత్వంలో చేయనున్న ఓజీ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంచి. అయితే ఈ మూడు సినిమాలు కంప్లీట్ చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు మూవీ ఎందుకు పక్కన పెట్టారు అనే ప్రశ్న తలెత్తుతుంది. హరిహర వీరమల్లు మూవీ షూటింగ్ ఇంకా 35 రోజులు మాత్రమే పెండింగ్ ఉందని గతంలో నిర్మాత ఏఎం రత్నం పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే క్రిష్ కూడా ఈ సినిమా ఎంత వేగంగా పూర్తి చేసి రిలీజ్ కి రెడీ చేద్దామా అనే ఆలోచనతోనే ఉన్నారు. అయతే ప్రస్తుతం ఈ మూవీకి ఆర్ధిక ఇబ్బందులు ఉన్నాయనే ప్రచారం తెరపైకి వచ్చింది. గత రెండేళ్ళ నుంచి ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. దీంతో నిర్మాణ వ్యయం బాగా ఎక్కువ అయ్యిందని సమాచారం. అనుకున్న బడ్జెట్ కంటే అదనంగా ఖర్చు అయ్యిందనే టాక్ నడుస్తుంది. ఈ నేపధ్యంలో ప్రస్తుతం నిర్మాత కూడా ఈ సినిమా షూటింగ్ కొనసాగించడానికి సరిపడా పెట్టుబడి లేక ఇబ్బందులు పడుతున్నట్లు ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలో షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారని టాక్.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు అన్ని పూర్తి చేసిన తర్వాత హరిహర వీరమల్లు స్టార్ట్ చేద్దామని చెప్పినట్లుగా కూడా టాక్ నడుస్తుంది. అయితే ఆర్ధిక ఇబ్బందులు ఏవీ లేవని, ప్రస్తుతం షూటింగ్ నడుస్తుందనే మాట కూడా వినిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కొత్త సినిమాలు షూటింగ్ చేస్తూనే హరిహర వీరమల్లు కోసం నెలలో ఒక వారం, పది రోజులు కేటాయిస్తున్నారని టాక్. అయితే పీరియాడిక్ జోనర్ మూవీ, విజువల్ ఎఫెక్ట్స్ బేస్ మీద హరిహర వీరమల్లు కథ ఉంటుంది. ఈ నేపధ్యంలో క్రిష్ ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చూసుకుంటూనే మరో వైపు షూటింగ్ చేస్తూ ఉన్నారని టాక్. ఈ కారణంగా షూటింగ్ ఆలస్యం అవుతుందనే మాట వినిపిస్తుంది.