Wed. Jan 21st, 2026

    Hanuman Pooja: సాధారణంగా మనం ఏ పని చేసిన కొన్ని కారణాల వల్ల తరచూ ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మనం చేసే పనులు విజయవంతంగా పూర్తి కావాలి అంటే ఆంజనేయస్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించాలని పండితులు చెబుతున్నారు.ఇలా ఆంజనేయ స్వామిని పూజించే విధానంలో కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించడం వల్ల మనం చేసే పనిలో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ఎంతో విజయవంతంగా పూర్తి అవుతాయి మరి ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి అనే విషయానికి వస్తే…

     

    ప్రతిరోజు ఆంజనేయస్వామి చాలీసాను 11 సార్లు చదవాలి.ఈ విధంగా హనుమాన్ చాలీసా చదువుతున్న సమయంలో తిరుగుతూ చదవకుండా ఒకే ఆసనంపై కూర్చొని చదవడం ఎంతో ముఖ్యం. పక్కకు లేకుండా హనుమాన్ చాలీసా ను 11 సార్లు చదవడం పూర్తి చేసి చివరిలో శ్రీరామరక్ష స్తోత్రం చదవాలి.ఇలా మంగళవారం, శనివారం ఒక పూట ఉపవాసం ఉండి హనుమాన్ చాలీసా చదవడం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు ఎల్లవేళలా మనపై ఉంటాయి.

    Hanuman Pooja

    ఇక మంగళవారం లేదా స్వామివారికి పూజ చేసిన తర్వాత కొబ్బరికాయను సమర్పించడం ఎంతో ముఖ్యం.ఇక ఇంట్లో ఆటంకాలు ఎదురవుతాయి అని భావించేవారు దగ్గరలో ఉన్నటువంటి హనుమాన్ ఆలయానికి వెళ్లి అక్కడ కూడా హనుమాన్ చాలీసాలు చదివి స్వామివారిని దర్శించుకుని స్వామివారికి కొబ్బరికాయను నైవేద్యంగా సమర్పించడం ఎంతో మంచిది.ఈ విధంగా మంగళవారం లేదా శనివారం హనుమాన్ చాలీసా చదవడం వల్ల మనం చేసే పనులలో ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదరవకుండా పనులు దిగ్విజయంగా పూర్తి అవుతాయని పండితులు చెబుతున్నారు. ఇక వీలైతే మన ఆర్థిక స్తోమతను బట్టి నెలకు ఒకసారి అయినా స్వామివారికి తమలపాకులతో పూజ చేయడం ఎంతో మంచిది.