Vastu Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఎన్నో రకాల వాస్తు పరిహారాలను పాటిస్తూ ఉంటాము అదేవిధంగా ఇంట్లో పూజ చేసే సమయంలో కూడా ఎన్నో వాస్తు నియమాలను అనుసరిస్తూ పూజ చేస్తూ ఉంటాము. అయితే చాలామంది ప్రతి అమావాస్యకు లేదంటే ప్రతి వారం ఇంటి గుమ్మం దగ్గర పచ్చిమిరపకాయలు లేదంటే ఎండుమిరపకాయలు నిమ్మకాయలతో పాటు ఒక బొగ్గు కూడా దారానికి కట్టి వేలాడదీసి పూజ చేస్తూ ఉంటారు.
ఈ విధంగా ఎండుమిరపకాయలు నిమ్మకాయలను గుమ్మానికి వేలాడదీయడం వెనక గల కారణం ఏంటి అనే విషయాన్ని వస్తే.. పురాణాల ప్రకారం ఇలా మిరపకాయలను గుమ్మానికి వేలాడ తీయడం వల్ల మన ఇంటికి తగిలిన దిష్టి మనపై ప్రభావం చూపదని అలా నరదృష్టి తగలకుండా ఉండటం కోసమే ఇలాంటివి కడతారని భావిస్తూ ఉంటారు. అంతేకాకుండా దరిద్ర దేవత అయిన అలక్ష్మికి నిమ్మకాయ మిరపకాయలు అంటే ఎంతో ప్రీతికరం వాటిని ఇంటి ముందు కట్టడం వల్ల ఆమె ఇంటి గుమ్మం వరకే వచ్చి వెనదిరిగి వెళ్తారని భావిస్తారు.
ఇలా దరిద్ర దేవత ఇంట్లోకి రాకుండా ఉండటం కోసమే ఇలా నిమ్మకాయలను మిర్చి కడతారు అయితే ప్రతి అమావాస్య రోజు ఈ నిమ్మకాయను అలాగే మిరపకాయలను మార్చి కొత్తవి కడుతూ ఉంటారు. ఇక సైన్స్ ప్రకారం అయితే పూర్వకాలంలో కరెంటు పోతే ఇంట్లోకి క్రిమి కీటకాలు పెద్ద ఎత్తున వచ్చేవి అయితే ఆ క్రిమి కీటకాలు ఇంట్లోకి రాకుండా నిమ్మకాయలో ఉన్న సిట్రిక్ యాసిడ్ మిరపకాయలు ఉండే విటమిన్స్ వాటిని అడ్డుకుంటాయని అందుకే వీటిని గుమ్మానికి వేలాడదీస్తారని సైన్స్ కూడా చెబుతోంది.