Guppedantha manasu serial: వసుధార తన మెడలో తాను తాళి వేసుకోవడం తప్పని సూచిస్తాడు రిషి. అంతేకాక ఈ పూజలో మనం కూర్చోవడం లేదని తేల్చి చెప్తాడు. దాంతో వసు బాధపడుతుంది. చివరకు జగతి, మహింద్రలు పీటల మీద కూర్చుని పూజ పూర్తి చేస్తారు. వసు రిషి గురించి, రిషి వసు గురించి తమ బాధల్ని దేవుడి దగ్గర మొరపెట్టుకుంటారు. జగతి దంపతులు కూడా రిషిధారల గురించే వేడుకుంటారు. ఆ తర్వాత పూజారి అందరికీ ప్రసాదం పంచమంటాడు.
ధరణి ప్రసాదం ఇస్తే దేవయాని తీసుకోదు. దాంతో రిషే వెళ్లి ప్రసాదం పెడతాడు. అపుడే దేవయాని తన గోడును వెల్లబోసుకుంటుంది. పెద్దమ్మ ప్లీజ్.. అంటూ బతిలాడతాడు రిషి. అలా ఆ రోజు కార్యక్రమం ముగుస్తుంది. ఆ తర్వాత సీన్‌లో దేవయాని వసు గదికి వెళ్తుంది. నువ్వేంటో, నీ స్థాయి ఏంటో స్పష్టంగా అర్థమైందా? ఈ ఇంట్లో నువ్ ఒక అతిథివి మాత్రమే.. అంటూ వసుని రెచ్చగొడుతుంది దేవయాని.
Guppedantha manasu serial: పూజలో నీతో రిషి కూర్చోలేదని ఎగతాళి చేస్తుంది. అపుడు వసు నవ్వుతూ.. దేవయానికి షాకిస్తుంది. ఏదో ఊహించుకుని సంతోషపడుతున్నారు కానీ మా బంధం ఎప్పటికీ చెక్కు చెదరదని గర్వంగా చెబుతుంది. అంతేకాకుండా దేవయానికి ఓ రేంజ్‌లో క్లాస్ పీకుతుంది. రిషి సర్ నా గుండెల్లో ఉన్నారు.. ఉదయం నుంచి రాత్రి వరకు రిషి సర్ వెంటే ఉంటాను కదా నాకేం బాధ మేడం అంటుంది వసు. నువ్ ఎప్పటికైనా గుమ్మం దాటి వెళ్తావని వసుకు వార్నింగ్ ఇస్తుంది దేవయాని. కానీ వసు ఒప్పుకోకుండా తన ప్రేమ గురించి చెప్తుంది. నాకు నిద్రొస్తుంది మీరు వెళ్లండి మేడం అంటుంది వసు.
సీన్ కట్ చేస్తే.. రిషి సర్ ఇంకా లేవలేదా? అంటూ రిషి గది ముందు తిరుగుతుంది వసు. జగతి చూసి లోపలికి వెళ్లే అధికారం నీకుందని ధైర్యం చెబుతుంది వసుకి. నా అడుగులు ముందుకు పడడం లేదని తడబడుతుంది వసు. దాంతో వసుని బలవంతంగా రిషి గదిలోకి తోస్తుంది జగతి. పడుకున్న రిషిని చూస్తూ ఊహల్లో తేలిపోతుంది వసు. మెళకువ వచ్చి రిషి గుడ్ మార్నింగ్ వసుధార అంటాడు. నువ్వేంటి ఇక్కడ అని అడగ్గా.. నసుగుతుంది వసు.
ఆ తర్వాత రిషి బెడ్ మీది నుంచి లేచి వసుకి దగ్గరగా వెళ్తాడు. ఆ తర్వాత వసు కిందికి వంగినపుడు తన మెడలో ఉన్న తాళిని చూసి మళ్లీ హర్ట్ అవుతాడు రిషి. నేను వెళ్లి రెడీ అయి వస్తాను నువ్ వెళ్లు అంటాడు రిషి. ఆ తర్వాత వసు కిచెన్‌లోకి వెళ్తుంది. అక్కడే ఉన్న ధరణితో కాసేపు మాట్లాడుతుంది. మేడం ఏంటి వసుధార? చక్కగా వరుసలు పెట్టి పిలవమని సూచిస్తుంది ధరణి. అలాంటి రోజు త్వరలోనే వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తుంది వసు.
సీన్ కట్ చేస్తే.. రిషి తనని తానే అద్దంలో చూసుకుంటూ మాట్లాడతాడు. అక్కడ వసు కూడా అద్దం ముందు నిల్చుని తాళిని చేతులో పెట్టుకుని మాట్లాడుకుంటుంది. అలా నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.