Wed. Jan 21st, 2026

    Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషి, వసులు లైబ్రరీలో ఉంటారు. అపుడే వసు మెడలో ఉన్న ఉంగరం కనిపిస్తుంది. ఆ తర్వాత రిషి ఈ రోజు తాడో పేడో తేల్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. వెంటనే వసుధారం ఇంటికి వెళ్తాడు. వసు గదిలో కనిపించినవి చూసి రిషి నిజం తెలుసుకుంటాడు. మరి ఈ రోజు ఏం జరిగిందో చూద్దాం..

    వసు అమ్మవారి దగ్గర రిషి తనని అర్థం చేసుకోవాలని వేడుకుంటుంది. రిషి తనని చేసుకున్న అపార్థాలన్నింటిని గుర్తుచేసుకుంటూ కంటతడిపెడుతుంది. అమ్మవారి ముందు పసుపు కుంకుమతో రిషిధార అని రాస్తుంది. రిషి సార్ నిజం తెలుసుకున్నారా లేదా.. ఈ కన్నీళ్లు ఎన్నాళ్లు.. రిషి సార్‌ని నువ్వే మార్చాలని అమ్మవారిని కోరుకుంటుంది. అపుడే వెనకాల నుంచి రిషి వచ్చి వసుధార అంటాడు. ఇద్దరూ ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. మీరు వస్తారని నాకు తెలుసు అంటూ ఎమోషనల్ అవుతుంది వసు. అపుడే వసు మెడలో ఉన్న తాళి రిషి చొక్కాలో చిక్కుకుంటుంది.

    Guppedantha manasu serial: vasudhara rishi reunite
    Guppedantha manasu serial: vasudhara rishi reunite

    Guppedantha manasu serial: ఒక్క నిజం తెలుసుకోవడానికి నాకు ఇన్నాళ్లు పట్టిందేంటి? ఎందుకు వసుధార ఇలా చేశావ్ అని నిలదీస్తాడు. ఎందుకు నా ఎమోషన్స్, ప్రేమతో ఆడుకున్నావ్. ఎందుకిలా చేశావని అరుస్తాడు. దాంతో ఆ రోజు జరిగిందంతా వివరిస్తుంది వసు. కాలేజిలో ఒక్కొక్కరు ఒక్కో మాట మాట్లాడుతుంటే రంపంతో కోసినట్టయింది అని అంటాడు రిషి. అయినా నీ మెడలో నువ్ తాళి వేసుకోవడమేంటి వసుధార అని ప్రశ్నిస్తాడు. అలా రిషి ఇన్నాళ్లు తాను పడ్డ ఆవేదనంతా వసుకు చెప్తూ ఎమోషనల్ అవుతాడు. ఈ తాళి నా ఇష్ట ప్రకారమే నా మెడలో పడింది. మీకు తెలియకుండా నా మెడలో కట్టారని అనుకుంటున్నాను. అసలు మీకు తెలుసా సార్ ఈ తాళి మీ చేతులతోనే నాకు ఇచ్చారు. ఇంతకన్నా పవిత్రత, పరమార్థం ఇంకేం కావాలి సార్ అంటుంది వసు. నువ్వు ఎన్నైనా చెప్పు వసుధార. నువ్ చేసింది తప్పు అంటూ వాదిస్తాడు రిషి. అపుడే వసు కళ్లు తిరిగి కిందపడబోతుంటే రిషి చేతులమీద ఎత్తుకుని వెళ్తాడు.

    ఆ తర్వాత సీన్‌లో దేవయాని ధరణిని పిలుస్తుంది. ధరణి చేతిలో ఉన్న శుభలేఖని తీసుకుని చూస్తుంది. అపుడే జగతి, మహింద్రలు రావడం చూసి.. ‘ధరణి.. అంతా బాగుంటే మన ఇంట్లో కూడా రిషి పేరు మీద శుభలేఖ వేయించేవాళ్లం కదా’ అని అంటుంది. కావాలని ఏమన్నారు వదిన గారు అని అడుగుతాడు మహింద్ర. అలా మహింద్ర, దేవయానిలు ఒకరినొకరు దెప్పి పొడుచుకుంటారు. మీరు రిషి నమ్మకాన్ని వమ్ము చేశారు. ఇపుడు రిషి నన్ను నమ్ముతాడు. నా మీద ప్రేమ ఉంది అంటూ గొప్పలు చెప్పి వెళ్లిపోతుంది దేవయాని. అది చూసి జగతి, మహింద్రలు నవ్వుకుంటారు.

    రిషి వసుని కారులో తీసుకెళ్తూ గతంలో తాను దాచిన విషయాన్ని తలుచుకుంటూ బాధపడతాడు. నువ్ చేసిన పని మన జీవితాల్ని తారుమారు చేసిందని మనసులో అనుకుంటాడు. వసుధార అంటూ పిలిచి.. అలా పడిపోయావేంటి అని అడుగుతాడు. టెన్షన్‌లో అలా జరిగిందంటుంది వసు. మీరు ఉండగా నాకేంటని వసు అనగానే రిషికి ఎక్కిళ్లు వస్తాయి. వాటర్ తీసుకొస్తానంటూ షాప్‌కి వెళ్తుంది వసు. నీళ్లు తీసుకొచ్చి రిషికి ఇస్తుంది. నిన్ను చూస్తుంటే బోలెడంత కోపం వస్తుందని అనుకుంటారు ఒకరినొకరు. మీరెంత బాధపడ్డారో నేను కూడా అంతే బాధపడ్డానంటుంది వసు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం…