Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: ‘ఐ లవ్యూ ఎండీ గారు. మీ పొగరు’ అని వసు రాసిన కాగితాన్ని చూసి షాకైన రిషి.. మామకు థ్యాంక్స్ చెప్పిన అల్లుడు!

Guppedantha manasu serial: నిన్నటి ఎపిసోడ్‌లో రిషి ప్రశాంతత కోసం లైబ్రరీకి వెళ్తాడు. అప్పటికే వసు అక్కడ ఉంటుంది. మరి ఏం జరిగిందో ఈ రోజు ఎపిసోడ్‌లో చూద్దాం.. రిషి బుక్స్ కోసం వెతుకుతుండగా వసు మెడలో ఉన్న గొలుసు కనిపిస్తుంది. దానికే ఉన్న ఉంగరంను చూసి గతంలో వసు చెప్పిన మాటల్ని చేసుకుంటాడు. వెంటనే వసుకు ఎదురెళ్లి ఆ ఉంగరాన్ని తాకుతాడు. అలా ఇద్దరూ కాసేపు ఒకరినొకరు చూసుకుంటుంటే వసు వెళ్లిపోతుంది. వసు చేయి పట్టుకుని ఆపుతాడు రిషి. ఆ ఉంగరం అక్కడ ఎందుకు ఉంది అని వసుని అడుగుతాడు. నాకు ఇష్టం లేకుండా నా మెడలోకి రాదు కదా అని వసు చెప్తుండగా వాచ్‌మెన్ వచ్చి డిస్ట్రబ్ చేస్తాడు. దాంతో వసు వెళ్లిపోతుంది. రిషి కూడా వెళ్లిపోతాడు.

ఆ తర్వాత సీన్‌లో వసు తాళి మెడలో వేసుకున్న గతాన్ని గుర్తుచేసుకుంటుంది. రిషి నిజం తెలుసుకోలేక పోతున్నందుకు బాధపడుతుంది. సరైన దిశగా ఆలోచించలేకపోతున్నాడని చింతిస్తుంది. ఇంత స్పష్టంగా చెప్పినా అర్థం చేసుకోలేకపోయాడని మదనపడుతుంది. రిషి గురించి ఆలోచిస్తుండగానే చక్రపాణి ఫోన్ చేసి ఎప్పుడు వస్తావమ్మా అని అడుగుతాడు. మళ్లీ ఫోన్ కట్ చేసి వసు రిషి ఆలోచనలోనే పడుతుంది.

Guppedantha manasu serial: vasudhara is disappointed

Guppedantha manasu serial: అక్కడ రిషి కూడా వసుధార గురించే ఆలోచిస్తాడు. అసలు ఈ వసుధార ఏమనుకుంటుందని మనసులో అనుకుంటాడు. వసు చెప్పిన మాటల్ని గుర్తుచేసుకుంటూ తన ఉద్దేశం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. గతంలో వసు తన పెళ్లి గురించి చెప్పిన మాటలన్నీ గుర్తు చేసుకుంటాడు. నాకు ఇక ఓపిక లేదు. ఈ రోజు అటో ఇటో తేల్చుకుంటాను అని బయల్దేరతాడు. వసుధార నేనిక డైరెక్ట్‌గా అడిగేస్తాను అనుకుంటూ వసు ఇంటికి వెళ్తాడు. చక్రపాణి చూసి సర్ మీరా రండి అంటూ పిలిచి కూర్చోమంటారు. వసుని పిలవమని చెప్పగా ఇంకా ఇంటికి రాలేదు.. ఆలస్యమవుతుందని చెప్తాడు. సరే వచ్చేదాకా నేను ఎదురుచూస్తానని చెప్తాడు రిషి. ఆ గదిలో కూర్చోండి అని బెడ్రూంకి తీసుకెళ్తాడు చక్రపాణి. ఈ గదిలో మీ అల్లుడు గారు ఉన్నారని వసు చెప్పింది మరెక్కడా అని అడుగుతాడు రిషి. వసమ్మ చెప్పిందంటే ఉన్నట్లే కదా అని రిషిని తికమక పెడతాడు చక్రపాణి. దాంతో రిషికి చిరాకు వస్తుంది.

అద్దంలో రిషి తనని తానే చూసుకుంటూ వసు మాటల్ని తలుచుకుంటాడు. అంతలోనే ఫ్యాన్ గాలికి టేబుల్ మీద ఉన్న పేపర్లు రిషి ముందు చెల్లాచెదురుగా పడతాయి. అందులో వసు రాసిన ‘ఐ లవ్యూ ఎండీ గారు. మీ పొగరు’ దాన్ని చూస్తాడు. అపుడే రిషి ఇచ్చిన నెమలి ఈక కూడా చూస్తాడు. అద్దంలో తనని తానే చూసుకున్నాక రిషికి తనే వసుకి కావల్సిన వ్యక్తి అని అర్థమైపోతుంది. నన్ను బాధపెట్టి నవ్వూ బాధపడుతున్నావా వసుధారం అనుకుంటూ వసుకు ఫోన్ చేస్తాడు. చక్రపాణి టీ ఇస్తుంటే వద్దనుకుంటూ వెళ్లిపోతాడు రిషి. వసు ఎక్కడుందో నాకు తెలుసు అనుకుంటూ చక్రపాణికి థాంక్స్ చెప్పి వెళ్లిపోతాడు రిషి. మరి వసుకు రిషి ఏవిధంగా దగ్గరవుతాడో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

Savitha S

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

14 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

16 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.