Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: రిషి భవిష్యత్తు గురించి తల్లిదండ్రుల్లో ఆందోళన.. రిషి కారు హారన్ సౌండ్ విని పరుగెత్తుకెళ్లిన వసు

Guppedantha manasu serial: రిషికి మినిస్టర్ ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్తాడు. మీరిద్దరూ పెళ్లి చేసుకున్నారని తెలిసి ఆనందపడ్డానని అంటాడు. వసుకు ఫోన్ చేసి మిమ్మల్ని రమ్మంటే రిషి సర్ పర్మిషన్ తీసుకుని చెప్తా అందట.. ఇదేంటి రిషి అని అడుగుతాడు మినిస్టర్. ఆ తర్వాత ఇద్దర్ని భోజనానికి రమ్మని పిలుస్తాడు. సరేనంటాడు రిషి.

ఆ తర్వాత సీన్‌లో మహింద్ర, జగతిలు సరదాగా పోట్లాడుకుంటారు. వసు, రిషిల ఫొటో ఎక్కడ పెడదాం అనుకుంటారు. చివరకు ఆ ఫొటో గోడకు అంటిపెడుతుండగా రిషి వస్తాడు. రిషిని చూసి బెదిరిపోతాడు మహింద్ర. వసుధార ఇంకా రావట్లేదేంటని జగతిని అడుగుతాడు రిషి. నాకేం చెప్పలేదంటుంది జగతి. ఆ తర్వాత గోడకు ఉన్న పోస్టర్ చూసి ఇదేంటని అడుగుతాడు రిషి. ఏం చెప్పాలో తెలియక మహింద్ర నసుగుతాడు. పోస్టర్ చూసి కోపంగా రియాక్ట్ అవుతాడు రిషి. నీకిష్టం లేకపోతే తీసేద్దామంటాడు మహింద్ర. ఉండనివ్వండి డాడ్ అంటాడు రిషి. స్టూడెంట్స్ అభిమానాన్ని మనం గౌరవించాలని హితబోధ చేస్తాడు రిషి.

Guppedantha manasu serial: mahindra jagati are upset

Guppedantha manasu serial: వసుధార కాలేజికి ఎందుకు రాలేదని ఆలోచిస్తాడు రిషి. ఫోన్ చేద్దామని తీస్తాడు కానీ తాను చేయనపుడు నేనెందుకు చేస్తానని అనుకుంటాడు. అంతలోనే రిషికి జగతి కనిపిస్తుంది. మేడం.. కాలేజికి వసుధార ఎందుకు రాలేదంటారు అని అడుగుతాడు. నాకైతే తెలియదు రిషి అంటుంది జగతి. కాల్ చేసి అడగమని సూచిస్తాడు రిషి. దాంతో జగతి వసుకు కాల్ చేస్తుంది. కాలేజికి ఎందుకు రాలేదని ఎండీ గారు అడుగుతున్నారని అంటుంది. స్పీకర్ ఆన్ చేస్తుంది జగతి. రావాలనిపించలేదని పొగరుగా సమాధానం చెప్తుంది వసు. ఎప్పటికా.. ఇప్పుడేనా అంటాడు రిషి ఇన్‌డైరెక్ట్‌గా వసుతో. రావట్లేదని మెయిల్ గానీ, మెసేజ్ గానీ పెట్టొచ్చు కదా అంటుంది జగతి. రిషి ఎంత టెన్షన్‌గా ఉన్నాడో తెలుసా అని ప్రశ్నిస్తుంది.

సీన్ కట్ చేస్తే.. జగతి, మహింద్రలు తల పట్టుకుని కూర్చుంటారు. ఏం ఆలోచిస్తున్నావ్ మహింద్రా? అంటుంది జగతి. రిషి ఏంటో అర్థం కావట్లేదు జగతి అని బదులిస్తాడు మహింద్ర. ఆ తర్వాత వసు, రిషిల మధ్య గొడవలు జరుగుతున్నందుకు బాధపడతాడు మహింద్ర. నువ్ వాళ్ల గురించి ఆలోచించకు. ప్రేమే వాళ్లని నడిపిస్తుందని ధైర్యం చెప్తుంది జగతి. వాళ్ల ఇద్దరి బంధాన్ని ఎవరూ విడదీయలేరని సూచిస్తుంది. దాంతో మహింద్ర కూల్ అవుతాడు.

ఆ తర్వాత సీన్‌లో రిషి వసు కోసం వెళ్తుండగా మధ్యలో కాల్ వస్తుంది. ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను కానీ ఈ వివరాలు వసుకు చెప్పను అనుకుంటాడు మనసులో. ఆ తర్వాత ఒంటరిరగా ఆలోచిస్తున్న వసు దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు చక్రపాణి. కూతురికి ధైర్యం చెప్తాడు. అంతలోనే రిషి కారు హార్న్ కొడతాడు. రిషి సార్ వచ్చారు నాన్నా అనుకుంటూ పరుగెడుతుంది వసు. వసు కింద పడబోతుంటే పట్టుకుంటాడు రిషి. మనం బయటికి వెళ్లాలి అంటాడు రిషి. నాకొక రెండు నిమిషాలు టైం ఇవ్వండి రెడీ అవుతాను అంటుంది వసు. సరేనని లోపలికి వెళ్తాడు రిషి. వాళ్లిద్దర్ని అలా చూసి చక్రపాణి సంబరపడతాడు.

సీన్ కట్ చేస్తే.. దేవయాని కంగారుగా అటూ ఇటూ తిరగడం చూసి ఏంటి నీ ప్రాబ్లం అని అడుగుతాడు ఫణింద్ర. ప్రాబ్లం నాది కదా రిషిది అంటుంది దేవయాని. ఆ తర్వాత ఇద్దరి మధ్య ఏం జరుగుతుందో రేపటి ఎపిసోడ్‌లో చూద్దాం..

Savitha S

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

13 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

15 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.