Wed. Jan 21st, 2026

    Guppedantha manasu serial: వసుని తన క్యాబిన్‌కి పిలుస్తాడు రిషి. రిషి అడగకముందే తను బైక్ మీద రావడానికి గల కారణాన్ని వివరిస్తుంది వసు. నేను అది అడగడానికి పిలవలేదని రిషి అంటాడు. మరెందుకని అడగ్గా.. కాలేజికి సంబందించిన మెయిల్స్‌కి రిప్లై ఇవ్వమని చెప్తాడు. ఆ తర్వాత కాలేజికి సంబంధించిన గుడ్ న్యూస్ చెప్తాడు రిషి. దాంతో వసు సంబరపడుతుంది. జగతి మేడంకి, డాడీకి చెప్పమంటాడు. ఆ తర్వాత ఇద్దరూ కాసేపు సరదాగా పోట్లాడుకుంటారు.

    ఈ రిషి ఉన్న ప్రతిచోట వసుధార ఉంటుందని చెప్పి వెళ్తాడు రిషి. దాంతో ఫుల్ ఖుషి అవుతుంది వసు. బయటికి వెళ్లిన రిషిని వెతుకుతూ వెళ్తుంది వసు. ల్యాబ్ వైపు వెళ్తున్న రిషిని వెళ్లొద్దని అడ్డుకుంటుంది. జరిగింది గుర్తు లేదా సర్ అని గతం గుర్తుచేసుకుంటారు ఇద్దరూ. ల్యాబ్ ఇంచార్జికి బాధ్యతలు గుర్తుచేస్తుంది వసుధార. కానీ రిషి మాత్రం ఏంటి వసుధార ఇది అంటూ మందలిస్తాడు.

    Guppedantha manasu serial: jagathis suggestion for mahindra
    Guppedantha manasu serial: jagathis suggestion for mahindra

    Guppedantha manasu serial: అలా కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మన పెళ్లిని అంగీకరించమని అడుగుతుంది వసు. నా మనసుకు సమాధానం దొరికినపుడే నీకు సమాధానం చెప్తా అంటాడు రిషి. ఆ తర్వాత సీన్‌లో మహింద్ర, జగతిలు రిషి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కానీ రిషి వాళ్ల కోసమే ఎదురు చూస్తారు. ఇక తప్పక రిషిని కలుస్తారు. బైక్ మీద వచ్చినందుకు క్లాస్ పీకుతాడు రిషి. ఇంకోసారి ఇలా బైక్ మీద రావొద్దని సూచిస్తాడు.

    తర్వాత సీన్‌లో బైక్ మీద హ్యాపీగా వెళ్తారు జగతి, మహింద్రలు. ఆ తర్వాత వసు బైక్‌ని పార్కింగ్ నుంచి తీయించి వేస్తాడు రిషి. వసు వెళ్లి బైక్ కోసం వెతుకుతుంది. అపుడే రిషి అక్కడ నిల్చుని ఎదురుచూస్తాడు. రిషి సర్‌ని అడుగుతుంది వసు. నాకేం తెలియదంటాడు రిషి. నాకేదో డౌట్‌గా ఉందంటుంది వసు. సీసీ కెమెరా ఉంది కద చూస్తే తెలిసిపోతుంది అంటుంది వసు. చివరకు వసు రిషిలు కారులో వెళ్తారు. వెళ్తున్నపుడు బైక్ నేనే పక్కన పెట్టించానని చెప్తాడు రిషి. ఇంకోసారి బైక్ మీద రావొద్దని చెప్తాడు వసుకు.

    సీన్ కట్ చేస్తే.. రిషిధారలు వెళ్లడం చాటుగా చూసి సంతోషపడతారు జగతి, మహింద్రలు. ఇద్దరికి ఒకరంటే ఒకరికి చెప్పలేనంత ప్రేమ ఉంటుంది. అంతే పంతం కూడా ఉంటుందని అంటుంది జగతి. వీళ్లది విచిత్రమైన జంట అంటాడు మహింద్ర. నాకైతే వీళ్లిద్దర్ని చూస్తే టెన్షన్ అవుతుందని అంటాడు. వీళ్లు ఎప్పుడు కలుస్తారు జగతి అని ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత వీళ్లకి పెళ్లి చేస్తే అంతా బాగవుతుందేమో కదా అని ఆశాభావం వ్యక్తం చేస్తాడు మహింద్ర. జగతి మాత్రం ఈ మాట రిషిధారల ముందు అనకని చెప్తుంది. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.