Categories: EducationLatest

Guppedantha manasu serial: వసుని కొడుక్కు దగ్గర చేసే ప్రయత్నంలో జగతి.. రిషిధారల మధ్య చిచ్చు పెట్టాలని దేవయాని ప్లాన్

Guppedantha manasu serial: వసు, రిషిలు వేర్వేరుగా ఆలోచిస్తూ బాధపడతారు. పరిస్థితుల వల్ల నేను చేసిన పనికి నాకు గొప్ప శిక్ష వేశారని దిగులు పడుతుంది వసు. నీ మీద ప్రేమ తగ్గదు.. కోపం కూడా తగ్గదు కావచ్చు అనుకుంటాడు రిషి మనసులో. అపుడే వసుని చూస్తుంది జగతి. పొద్దున్నే ఆ తాళిని చూస్తూ.. ఈ బాధేంటి అని అడుగుతుంది. రిషి సర్ నన్నేం అనలేదు కానీ ఆయన నాకు పదిమందిలో గొప్ప స్థానాన్ని ఇచ్చారని అంటుంది వసు.

నీ మీద రిషికి ఉన్న ప్రేమను గుర్తు చేసుకో అంటూ మోటివేట్ చేస్తుంది జగతి. రిషి మనసు బంగారు కొండ అంటూ కొడుకుని పొగడుతుంది. రిషి మనసుకు నువ్ దగ్గర కావాలని సూచిస్తుంది. రిషి సర్ కోసం ఎంత కష్టమైనా భరిస్తానని హామీ ఇస్తుంది వసు.

Guppedantha manasu serial: jagathi motivates vasudhara
Guppedantha manasu serial: jagathi motivates vasudhara

Guppedantha manasu serial:  సీన్ కట్ చేస్తే.. రిషి కారు దగ్గరికి వెళ్లి నిల్చుంటాడు. అపుడే వసు కూడా కాలేజికి వెళ్లేందుకు బయల్దేరుతుంది. ఇద్దరూ పంతం పెట్టుకుని పిలిస్తేనే తీసుకెళ్తానని అనుకుంటారు మనసులో. వస్తుందా? రాదా? అని ఎదురు చూసి వెళ్లిపోతాడు రిషి. ఒంటరిగా వెళ్తూ వసు గురించే ఆలోచిస్తాడు రిషఇ. అంతలోనే వెనక బైక్ మీద హార్న్ కొడుతూ మహింద్ర, వసులు బైక్ మీద వస్తారు. రిషి కంటే ముందే కాలేజికి చేరుకుంటారు మహింద్ర.

కాలేజి గేటు దగ్గరే బైక్ ఆపుతాడు మహింద్ర. రిషి వెళ్లాక మనం వెళ్దాం.. అంతలో అలా అలా తిరిగి కాఫీ కాఫీ తాగి వద్దాం అంటాడు జగతితో. అంతలోనే వసు బైక్ కూడా వస్తుంది. తనని వదిలేసి వాళ్లిద్దరూ కాఫీకి వెళ్తారు. వసు ఏం అర్థం కాక కాలేజికి వెళ్లి వైక్ పార్క్ చేస్తుంది. అంతలోనే రిషి కారు వస్తుంది. టూ వీలర్ మీద రావడమేంటో అడగడానికి అంత ఇబ్బందా? అనుకుంటాడు రిషి. డాడ్ వాళ్ల బైక్ కనిపించట్లేదేంటని ఆరా తీస్తాడు.

అక్కడే ఉన్న వసుని చూస్తూ ఇప్పుడు కాదు నీ సంగతి తర్వాత చెప్తా అని మనసులో అనుకుంటూ వెళ్లిపోతాడు రిషి. ఆ తర్వాత క్యాబిన్‌కి వెళ్లి వసుని పిలవమంటాడు. సెక్యూరిటీ వెళ్లి చెప్పగానే వసు ఆలోచనలో పడుతుంది. నా మీద కస్సుబుస్సు అంటారేమోనని భయపడుతుంది. అందుకే రిషికి కాల్ చేస్తుంది. క్యాబిన్‌కే రమ్మని పిలుస్తాడు రిషి. సరేనంటూ వసు వెళ్తుండగా అపుడే జగతి వస్తుంది.

రిషి ఏమన్నాడు అని జగతి అడగ్గా.. అప్పుడేం అనలేదు కానీ ఇప్పుడు అంటారు అని ఊహిస్తుంది వసు. వసు మాటలకు జగతి నవ్వుకుంటుంది. ఆ తర్వాత తనని ఎందుకు వదిలేసి వచ్చారని ప్రశ్నిస్తుంది వసు. ఆ తర్వాత వసుతో నీ మీద నాకు నమ్మకం ఉంది.. నువ్ రిషి ఎలా ఉన్న తనని మార్చగలవు అంటుంది జగతి. నా ప్రతి విజయంలో సార్ ఉన్నారు. సర్ బాధ పోగట్టడమే నా లక్ష్యం అంటుంది వసు.

సీన్ కట్ చేస్తే.. ధరణి మీద అరుస్తుంది దేవయాని. ఆ తర్వాత దేవయాని పిలిపించిన పంతులు వచ్చి రేపు, ఎల్లుండి మంచి ముహుర్తం ఉందని చెప్తాడు. అంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

Savitha S

Recent Posts

PURANAPANDA SRINIVAS : పురాణపండకు త్యాగరాయ గానసభలో దక్కిన ఘనత!

PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…

2 weeks ago

Ram Charan: ఊహించని రేంజ్‌లో ‘పెద్ది’ ఫస్ట్ షాట్..’పుష్ప’ రికార్డ్స్ బద్దలు..!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…

3 weeks ago

Sreeleela: డార్జిలింగ్‌ లో యంగ్ హీరోయిన్‌కి చేదు అనుభవం..

Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్‌ ముగిసిన…

3 weeks ago

Nagababu : శ్రీరామచంద్రుని ‘ జయ జయ రామ ‘ ఆవిష్కరించడం అదృష్టం.

Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…

3 weeks ago

Tollywood : రీ రిలీజ్‌లో ‘సలార్‌’తో నాని సినిమా పోటీ

Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…

1 month ago

Tollywood : వైరల్ ప్రపంచం మూవీ రివ్యూ

Tollywood : డిజిట‌ల్ యుగంలో మ‌న‌కు ఎన్ని సౌక‌ర్యాలు అందుతున్నాయో అన్నీ స‌వాళ్లు ఎదుర‌వుతున్నాయి. టెక్నాల‌జీని స‌రిగ్గా వాడుకోక‌పోతే ఒక్కోసారి…

2 months ago