Categories: Tips

Kantara: కాంతారాకి సినిమాకి అరుదైన గౌరవం… ఏకంగా అక్కడ

Kantara: రిషబ్ శెట్టి హీరోగా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కాంతారా. ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. రిలీజ్ అయిన అన్ని భాషలలో కూడా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తెలుగులో అయితే  60 కోట్ల వరకు ఈ మూవీ కలెక్ట్ చేసి చరిత్ర సృష్టించింది అని చెప్పాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీకి ప్రీక్వెల్ ని తెరకెక్కించే పనిలో దర్శక నటుడు రిషబ్ శెట్టి ఉన్నాడు. కాంతారా 2గా ఈ మూవీ తెరకెక్కబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం ఇప్పటికే  ఊర్వశీ రౌతేలాని ఎంపిక చేశారు. ప్రస్తుతం ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమా ఇప్పుడు అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది. జెనీవాలోని ఐక్యరాజ్యసమితి సమితిలో ఈ సినిమాని ప్రదర్శించారు. దీనికోసం ఇప్పటికే రిషబ్ శెట్టి జెనీవా చేరుకున్నారు. ఇక ప్రకృతి, అడవుల పరిరక్షణలో కాంతారా సినిమా ఎలాంటి సందేశం ఇచ్చింది అనే అంశంపై రిషబ్ శెట్టి మాట్లాడారు. ఐక్యరాజ్యసమితిలో ఒక సినిమాని ప్రదర్శిస్తున్నారు అంటే కచ్చితంగా అదొక గొప్ప గౌరవంగా భావించాలి.

ఇప్పుడు కాంతారా సినిమాకి అలాంటి హానర్ లభించడం విశేషం. కాంతార మూవీ కథాంశం కూడా అడవులని కాపాడుకోవాలి అనే అంశంచుట్టూనే తిరుగుతుంది. అడవిలో క్షేత్రపాలకుడుగా ఉండే వరాహస్వామి ఇందులో మెయిన్ లీడ్ అనే సంగతి అందరికి తెలిసిందే. అడవుల ప్రాధాన్యతని చాలా చక్కగా మూవీలో చూపించారు. ఈ నేపధ్యంలో అతనికి ఈ సినిమాని ఐక్యరాజ్యసమితిలో ప్రదర్శించాల్సిందిగా ప్రత్యేక ఆహ్వానం అందింది. దీంతో రిషబ్ శెట్టి అక్కడికి వెళ్ళినట్లు తెలుస్తుంది.

Varalakshmi

Recent Posts

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

7 days ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

7 days ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

7 days ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

4 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

1 month ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 months ago

This website uses cookies.