Guppedantha manasu serial : నేటి ఎపిసోడ్‌లో వసుధార మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గురించి రిషికి వివరిస్తుంది. అపుడే రిషి చేతిలో ఉన్న మార్కర్ కిందపడుతుంది. దానికోసం ఇద్దరూ కిందకు వంగుతారు. అలా ఇద్దరి మధ్య కాసేపు రొమాంటిక్ సీన్ నడుస్తుంది. వసు ముక్కుకు అంటిని మార్కర్‌ని రిషి తుడవకుండా ఫొటో తీసి చూపిస్తాడు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదని వసు, రిషి మనసులో బాధపడతారు. వసుధార బ్యాగ్ తీసుకుని వెళ్తుండగా టేబుల్ మీద ఉన్న హార్ట్ కింద పడబోతుంది. అది పడకుండా ఆపుతుంది వసు. ఎందుకు పట్టుకున్నావ్ వసుధార అని రిషి అడగ్గా హార్ట్ కదా సర్ అంటుంది వసు. హార్ట్ లేని వాళ్లు హార్ట్ గురించి బాధపడతారా అని రిషి అనడంతో.. వెళ్తాను సర్ అంటూ బాధగా వెళ్లిపోతుంది వసు.
సీన్ కట్ చేస్తే సుమిత్ర భర్తకు ఫోన్ కూతురి గురించి అడుగుతుంది. అపుడే జగతి, మహింద్రలు అక్కడికి వెళ్తారు. మీరు మా ఇంటికి రావడమేంటి సర్ అని ఆశ్చర్యపోతాడు చక్రపాణి. నీతో పని ఉంది చక్రపాణి.. రిషి, వసులు పక్కపక్కనే ఉంటే చనువు పెరిగి నిజం తెలుసుకునే అవకాశం ఉంటుందని సూచిస్తాడు మహింద్ర. మా ప్లాన్‌కు మీరు సహకరిస్తే చాలని అంటాడు. అపుడే వాళ్లిద్దర్ని దూరంగా ఏదైనా టూర్‌కు పంపిద్దాం.. అని చెప్తుంది జగతి. వాళ్లిద్దరూ ఒకటైతే చాలు దేవుడా అని వేడుకుంటాడు చక్రపాణి.
Guppedantha manasu serial : సీన్ కట్ చేస్తే వసు పేపర్ మీద లవ్ సింబల్
ఆ తర్వాత సీన్‌లో రోడ్ మీద నిల్చున్న వసును లిఫ్ట్ ఏమైనా కావాలా? అని అడుగుతాడు రిషి. నేను డీబీఎస్టీ కాలేజిలో ఎంప్లాయిని.. క్యాబ్ బుక్ చేసుకుంటానని బుక్ చేసుకుంటుంది వసు. పొగరు అని లోపల అనుకుంటాడు రిషి. నిన్ను పిక్ చేసుకోవడానికి మీ ఇంట్లోకి కొత్తగా వచ్చిన వారు రారా? అని అడుగుతాడు రిషి. అలా ఇద్దరూ ఒకరినొకరు పొగరు అని మనసులో తిట్టుకుంటారు. చివరకు రిషి కారులో రావచ్చు కదా అని అంటుండగానే వసు కూడా వస్తాను సర్ అంటుంది. అలా ఇద్దరూ కారులో వెళ్లిపోతారు.
జగతి, మహింద్రలతో కలిసి రిషి భోజనం చేస్తాడు. అపుడే మహింద్ర మిషన్ ఎడ్యుకేషన్ తరపున జగతి, నేను విలేజ్ వెళ్లాలి అని చెప్తాడు. హ వెళ్లండి అంటాడు రిషి. తమ ప్లాన్ వర్కౌట్ అయిందనుకుని సంబరపడిపోతారు జగతి, మహింద్ర. విలేజ్‌కి వెళ్లేది రిషి, వసులే అని అనుకుంటారు.
సీన్ కట్ చేస్తే వసు పేపర్ మీద లవ్ సింబల్ వేసి వీఆర్ అని రాస్తుంది. ఎవరెంత ప్రయత్నించినా రిషి సర్ నిజం తెలుసుకుంటాడు. ఎప్పటిలాగే మేమిద్దరం కలిసిపోతాం అనుకుంటూ మనసులో మురిసిపోతుంది వసు. ఒకే కాఫీ ఇద్దరం తాగేవాళ్లం అంటూ గతాన్ని గుర్తుచేసుకుంటుంది. ఆ తర్వాత వసుకు ఎదురుగా చక్రపాణి నవ్వుతూ వస్తాడు. మీరిద్దరూ త్వరలోనే కలుస్తారనిపిస్తుంది అంటాడు. నాక్కూడా నాన్నా అంటూ గదిలోకి వెళ్తుంది వసు. కిటికీలోనుంచి చందమామని చూస్తూ మాట్లాడుతుంది వసు. అక్కడ రిషి కూడా చందమామతో వసుని ఉద్దేశించి మాట్లాడతాడు. అలా ఈ రోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.