Wed. Jan 21st, 2026

    Guppedantha manasu serial: మహింద్రా.. అసలు మీ మొగుడు పెళ్లాలు ఏమనుకుంటున్నారు. రిషికి జ్వరం వస్తే చూసుకోవడానికి మనం అందరం ఉన్నాం కదా.. మధ్యలో ఆ వసుధార ఏంటి అంటూ అరుస్తుంది దేవయాని. మనకు కావాల్సింది రిషికి జ్వరం తగ్గడం కదా వదిన గారు అంటాడు మహింద్ర. అలా వదిన మరిదిలు మాట్లాడుకుంటుండగా జగతి వస్తుంది. నీ కోసమే చూస్తున్న జగతి అంటుంది దేవయాని. వసుధారని ఇంట్లోనుంచి పంపించేయమని వార్నింగ్ ఇస్తుంది. అక్కయ్యా.. రిషికి జ్వరం తగ్గడం ఇంపార్టెంట్ కదా అని జగతి అంటుంది. అయినా వినకుండా కోపంతో మండిపడుతుంది దేవయాని. వదినగారూ అసలు మీ ప్రాబ్లం ఏంటి అని ప్రశ్నిస్తాడు మహింద్ర. రిషేంద్ర భూషణ్ నా కొడుకు అని నొక్కి చెప్తాడు. మీ ఇష్టం వచ్చినట్లు ఆడిస్తానంటే చూస్తూ ఊరుకోను అని గట్టిగానే చెప్తాడు మహింద్ర. ఆ తర్వాత అక్కడినుంచి వెళ్లిపోతారు ఇద్దరూ. దేవయాని మాత్రం ఏ తోచక కోపంగా ధరణిని పిలుస్తుంది.

    సీన్ కట్ చేస్తే.. రిషి మాటల్ని తలుచుకుంటుంది వసు. రిషికి త్వరగా జ్వరం తగ్గాలని కోరుకుంటుంది. రిషి నిద్ర నుంచి లేవగానే ఎలా ఉంది సర్ అంటూ పలకరిస్తుంది వసు. పరావాలేదు అంటూ రిషి లేస్తూ కింద పడబోతాడు. వసు వెళ్లి రిషిని పట్టుకుని జ్యూస్ తాగమని ఇస్తుంది. వద్దని వారిస్తాడు రిషి. ఆ తర్వాత ఇద్దరి మధ్య కాసేపు మాటల యుద్ధం నడుస్తుంది. అవసరమైనవి తప్ప అన్నీ చాలా బాగా చెప్తావ్ కదా అని అంటాడు రిషి. వసు మాత్రం వదలకుండా జ్యూస్ తాగిస్తుంది రిషికి. వసుకి తన మీద ఉన్న ప్రేమ, శ్రద్ధని చూసి ఉప్పొంగిపోతాడు రిషి.

    Guppedantha manasu serial: devayani is anxious
    Guppedantha manasu serial: devayani is anxious

    Guppedantha manasu serial: వసు మాటల్ని తలుచుకుంటాడు రిషి. నా కోసం కుర్చీ మీద పడుకున్నావా వసుధార అనుకుంటాడు. రిషి వాటర్ కోసం లేస్తాడు కానీ వసుకు డిస్ట్రబ్ అవుతుందని ఆగిపోతాడు. అపుడే వసు లేచి రిషికి టాబ్లెట్ ఇస్తుంది. నేనెళ్లి పాలు తీసుకొస్తాను సర్ అంటూ వసు వెళ్తుండగా తన చేయి పట్టుకుంటాడు రిషి. ఏంటి సర్ అని అడగ్గా.. ఏం లేదంటాడు రిషి. మీకు జ్వరం వస్తే నేను బాధపడకుండా ఉంటానా అంటుంది వసు. జ్వరం తగ్గేదాకా నేను చెప్పినట్లు వినండి సర్ అంటుంది వసు. వసు పాల కోసం కిందికి వెళ్తుంది.

    సీన్ కట్ చేస్తే.. దేవయాని ఒంటరిగా ఆలోచిస్తు ఇళ్లంతా తిరుగుతుంది. వసు పాలు తీసుకెళ్తూ ఇంకా పడుకోలేదా మేడం అంటూ పలకరిస్తుంది దేవయానిని. అలా ఇద్దరూ కాసేపు పోట్లాడుకుంటారు. ‘కొంప తీసి మీ ఇద్దరికీ పెళ్లయిపోయిందా ఏంటి’ అని అనుమానం వ్యక్తం చేస్తుంది దేవయాని. మీకు అన్నీ తెలుసు కదా మేడం అంటుంది వసు. దీన్నే తెగించడం అంటారు అంటూ వసు మీదికి అరుస్తుంది. అసలు నీ మెడలో ఆ తాళి సంగతేంటి? అని నిలదీస్తుంది వసుని. ఈ తాళికి కారణమెవరో మీకు తెలుసు కదా? ఓపిక పట్టండి అంటూ సవాల్ విసురుతుంది వసు.

    మరుసటి రోజు ఉదయం రిషి దగ్గరికి వెళ్లి పలకరిస్తారు జగతి, మహింద్రలు. టైంకు మందులు వేసుకోమని సూచిస్తాడు మహింద్ర. మినిస్టర్‌కి కాల్ చేసావా? అని అడుగుతుంది జగతి వసుని. చేశాను మేడం. ప్రెస్ మీట్ పెట్టి మిషన్ ఎడ్యుకేషన్ గురించి చెప్పమన్నాడు సర్ అంటుంది వసు.