Categories: EntertainmentLatest

Guppedantha manasu serial: రిషిని వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చిన దేవయాని.. వసు నా కోడలంటూ కౌంటర్ ఇచ్చిన జగతి!

Guppedantha manasu serial: డిస్మిస్ చేసిన స్టాఫ్‌ని రిపోర్టర్ క్లాస్ పీకుతాడు. ఈ విషయంలో మేమేం చేయలేము. తప్పు చేసి కవర్ చేయడం కరెక్ట్ కాదు మేడం అంటూ సలహా ఇస్తాడు. ఇవన్నీ చాటుగా విన్న జగతి, వసులు షాకవుతారు. రిషి ముందు జాగ్రత్త చూసి ఇద్దరూ మురిసిపోతారు. రిషి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో లోపలికి వెళ్లిపోతారు. ఆ తర్వాత దేవయాని దగ్గర మొర పెట్టుకుంటారు ఫ్రొఫెసర్లు. టైం బాలేనపుడు నేనేం చేయలేనంటూ వాళ్లని పంపిచేస్తుంది దేవయాని.

ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో మొదటగా జగతి మాట్లాడుతుంది. ఆ తర్వాత బోర్ట్ డైరెక్టర్ ఫణింద్రసార్‌ని మాట్లాడమని కోరుతుంది. ఫణింద్ర మాట్లాడుతూ కాలేజి గొప్పదనం వివరిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ అంటే డీబీఎస్టీ అంటూ చెప్పుకొస్తాడు. ప్రాజెక్ట్‌లో భాగంగా వసు, జగతిలను పొగడతాడు. ఆ తర్వాత వసుని ప్రాజెక్ట్ గురించి మాట్లాడమని అడుగుతాడు. వసు స్టేజ్ మీదుకు వెళ్తుండగా దేవయాని కూడా వెళ్తుంది. నేను కూడా వసు గురించి మాట్లాడతానని చెప్తుంది. అక్కడికి వెళ్లాక రిషిని వదిలి వెళ్లిపోమని ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. అయినా వసు ఏమాత్రం బెదరదు. నీ ధైర్యం ఏపాటిదో ఈరోజు చూస్తా అంటూ మాట్లాడడం ప్రారంభిస్తుంది దేవయాని. రిషిని పెంచింది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటుంది.

Guppedantha manasu serial: devayani cautions vasudhara

Guppedantha manasu serial: ఆ తర్వాత కొద్దిసేపు వసుని పొగడుతుంది. రిషికి అసిస్టెంట్‌గా చేరి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది అంటూ చెప్పుకొస్తుంది. ఇపుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్‌గా రాణిస్తుందంటూ చెప్తుంది. వసుధార మా ఇంటికి కోడలుగా రావాలని ఆశపడ్డాను.. ఇలాంటి అమ్మాయిని మా రిషి పెళ్లి చేసుకుంటే బాగుటుందని అనుకున్నా.. కానీ తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. వసుధార చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుంది అంటూ ప్రెస్‌మీట్‌లో అందరికీ షాకిస్తుంది దేవయాని. నీ మెడలో ఉన్న తాళిబొట్టుని ఎవరు కట్టారు అంటూ వేదిక మీదనే వసుని ప్రశ్నిస్తుంది. దాంతో జగతి, మహింద్రలకు ఏం చేయాలో తోచక కంగారు పడతారు. ఏం చెప్పాలో తెలియక వసు కూడా సతమతమవుతుంది. రిపోర్టర్లు కూడా వసుని మీ భర్త ఎవరూ అంటూ ప్రశ్నిస్తారు.

కోపంతో రగిలిపోయిన జగతి లేచి రిషి వల్ల అంటుంది. ఆ తర్వాత మైక్ దగ్గరికి వెళ్లి.. వసు మెడలో తాళి పడడానికి కారణం రిషి అంటూ అందరికీ చెప్తుంది జగతి. రిషి నా కొడుకు. వసుధార నా కోడలు అని తెలుపుతుంది. మతి ఉంటే మాట్లాడుతున్నావా? అని దేవయాని అనగా జగతి ఘూటుగా రిప్లై ఇస్తుంది. అపుడే అక్కడికి వస్తాడు రిషి. జగతి, దేవయాని మాట్లాడుకుంటుంటే అంతా వింటాడు రిషి. వెనకాల నిల్చున్న రిషిని చూసి అక్కడికి వెళ్తుంది దేవయాని. విన్నావా రిషి.. జగతి ఎంత మాట అన్నదో.. రిషి ఆగావేంటి? అక్కడికి వచ్చి చెప్పు అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంది దేవయాని.

వసు మెడలో తాళికి కారణం నువ్ కాదని చెప్పు రిషి అంటూ వేదిక మీదనే దబాయిస్తుంది దేవయాని. దాంతో అందరిలో కంగారు పెరుగుతుంది. మరి రిషి నిర్ణయమేంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.

Savitha S

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.