Guppedantha manasu serial: డిస్మిస్ చేసిన స్టాఫ్‌ని రిపోర్టర్ క్లాస్ పీకుతాడు. ఈ విషయంలో మేమేం చేయలేము. తప్పు చేసి కవర్ చేయడం కరెక్ట్ కాదు మేడం అంటూ సలహా ఇస్తాడు. ఇవన్నీ చాటుగా విన్న జగతి, వసులు షాకవుతారు. రిషి ముందు జాగ్రత్త చూసి ఇద్దరూ మురిసిపోతారు. రిషి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో లోపలికి వెళ్లిపోతారు. ఆ తర్వాత దేవయాని దగ్గర మొర పెట్టుకుంటారు ఫ్రొఫెసర్లు. టైం బాలేనపుడు నేనేం చేయలేనంటూ వాళ్లని పంపిచేస్తుంది దేవయాని.
ఆ తర్వాత ప్రెస్‌మీట్‌లో మొదటగా జగతి మాట్లాడుతుంది. ఆ తర్వాత బోర్ట్ డైరెక్టర్ ఫణింద్రసార్‌ని మాట్లాడమని కోరుతుంది. ఫణింద్ర మాట్లాడుతూ కాలేజి గొప్పదనం వివరిస్తాడు. మిషన్ ఎడ్యుకేషన్ అంటే డీబీఎస్టీ అంటూ చెప్పుకొస్తాడు. ప్రాజెక్ట్‌లో భాగంగా వసు, జగతిలను పొగడతాడు. ఆ తర్వాత వసుని ప్రాజెక్ట్ గురించి మాట్లాడమని అడుగుతాడు. వసు స్టేజ్ మీదుకు వెళ్తుండగా దేవయాని కూడా వెళ్తుంది. నేను కూడా వసు గురించి మాట్లాడతానని చెప్తుంది. అక్కడికి వెళ్లాక రిషిని వదిలి వెళ్లిపోమని ఫైనల్ వార్నింగ్ ఇస్తుంది. అయినా వసు ఏమాత్రం బెదరదు. నీ ధైర్యం ఏపాటిదో ఈరోజు చూస్తా అంటూ మాట్లాడడం ప్రారంభిస్తుంది దేవయాని. రిషిని పెంచింది నేనే అంటూ గొప్పలు చెప్పుకుంటుంది.
Guppedantha manasu serial: ఆ తర్వాత కొద్దిసేపు వసుని పొగడుతుంది. రిషికి అసిస్టెంట్‌గా చేరి యూనివర్సిటీ టాపర్‌గా నిలిచింది అంటూ చెప్పుకొస్తుంది. ఇపుడు మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ హెడ్‌గా రాణిస్తుందంటూ చెప్తుంది. వసుధార మా ఇంటికి కోడలుగా రావాలని ఆశపడ్డాను.. ఇలాంటి అమ్మాయిని మా రిషి పెళ్లి చేసుకుంటే బాగుటుందని అనుకున్నా.. కానీ తానొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. వసుధార చెప్పకుండా ఎవరినో పెళ్లి చేసుకుంది అంటూ ప్రెస్‌మీట్‌లో అందరికీ షాకిస్తుంది దేవయాని. నీ మెడలో ఉన్న తాళిబొట్టుని ఎవరు కట్టారు అంటూ వేదిక మీదనే వసుని ప్రశ్నిస్తుంది. దాంతో జగతి, మహింద్రలకు ఏం చేయాలో తోచక కంగారు పడతారు. ఏం చెప్పాలో తెలియక వసు కూడా సతమతమవుతుంది. రిపోర్టర్లు కూడా వసుని మీ భర్త ఎవరూ అంటూ ప్రశ్నిస్తారు.
కోపంతో రగిలిపోయిన జగతి లేచి రిషి వల్ల అంటుంది. ఆ తర్వాత మైక్ దగ్గరికి వెళ్లి.. వసు మెడలో తాళి పడడానికి కారణం రిషి అంటూ అందరికీ చెప్తుంది జగతి. రిషి నా కొడుకు. వసుధార నా కోడలు అని తెలుపుతుంది. మతి ఉంటే మాట్లాడుతున్నావా? అని దేవయాని అనగా జగతి ఘూటుగా రిప్లై ఇస్తుంది. అపుడే అక్కడికి వస్తాడు రిషి. జగతి, దేవయాని మాట్లాడుకుంటుంటే అంతా వింటాడు రిషి. వెనకాల నిల్చున్న రిషిని చూసి అక్కడికి వెళ్తుంది దేవయాని. విన్నావా రిషి.. జగతి ఎంత మాట అన్నదో.. రిషి ఆగావేంటి? అక్కడికి వచ్చి చెప్పు అంటూ చేయి పట్టుకుని లాక్కెళ్తుంది దేవయాని.
వసు మెడలో తాళికి కారణం నువ్ కాదని చెప్పు రిషి అంటూ వేదిక మీదనే దబాయిస్తుంది దేవయాని. దాంతో అందరిలో కంగారు పెరుగుతుంది. మరి రిషి నిర్ణయమేంటో తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.