Guava Leaves: సాధారణంగా మహిళలలో నెలసరి సమయంలో హార్మోన్ హెచ్చుతగ్గులు జరగటం వల్ల చాలామంది నెలసరి సమయంలో తీవ్రమైనటువంటి నొప్పి సమస్యతో బాధపడుతూ ఉంటారు. కాళ్లు లాగడం మరికొందరిలో నడుము నొప్పి కడుపు నొప్పి వంటివి తీవ్రమైనటువంటి నొప్పిని కలిగిస్తూ చాలా బాధపడుతూ ఉంటాయి. ఈ నొప్పి సమస్య కారణంగా చాలామంది నొప్పి నుంచి ఉపశమనం పొందటానికి ఎక్కువ డోస్ ఉన్నటువంటి పెయిన్ కిల్లర్స్ ఉపయోగిస్తూ ఉంటారు.
ఇలా పెయిన్ కిల్లర్స్ ఉపయోగించడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ఆ నొప్పిని తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. అయితే ఇకపై ఇలాంటి పెయిన్ కిల్లర్స్ లేకుండా నెలసరి సమయంలో వచ్చే నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందడానికి ఈ చిన్న చిట్కా ఫాలో అయితే సరిపోతుంది. మన ఇంటి ఆవరణంలో పెరిగే ఆకులతో ఈ నొప్పి సమస్య నుంచి పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఆ సమయంలో నొప్పి అధికంగా ఉన్నప్పుడు కొన్ని జామ ఆకులను తుంచి శుభ్రంగా కడిగి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి రెండు గ్లాసుల నీటిని వేసి స్టవ్ మీద బాగా మరిగించాలి ఇలా రెండు గ్లాసుల నీళ్లు ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించాలి.
ఇలా మరిగించిన నీటిని వడపోసుకుని కాస్త గోరువెచ్చగా తాగాలి ఇలా తాగటం వల్ల నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి కూడా పూర్తిగా ఉపశమనం పొందవచ్చు. ఇలా తాగలేని వారు నమలి మింగడం వల్ల కూడా నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు అయితే జామ పండులో ఉండే విటమిన్లు పోషక విలువలన్ని కూడా జామ ఆకులో కూడా ఉంటాయి అందుకే నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. ఇక జామ ఆకును ప్రతిరోజు తినటం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీర్ణక్రియ వ్యవస్థ మెరుపు పరచడమే కాకుండా అధిక శరీర బరువు ఉన్నవారు బరువు తగ్గడానికి కూడా జామ ఆకులు కీలకపాత్ర పోషిస్తాయి.