Technology: భారత్ లో విస్తృతంగా ఇంటర్నెట్ సేవలను ప్రజలు వినియోగించు కుంటున్నారు. ఇతర దేశాల వాళ్ళు టెక్నాలజీలో కొత్త కొత్త ఆవిష్కరణలు చేస్తూ ఉంటే వాటిని భారతీయులు మాత్రం చాలా సులభంగా నేర్చుకుని తమ అవసరాలకు అనుగుణంగా వాడుకుంటున్నారు. ఓ విధంగా చెప్పాలంటే ఈ విషయంలో భారతీయులు తెలివి చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. ఎంత అద్భుతమైన టెక్నాలజీ అన్న హ్యాక్ చేయగలిగే తెలివితేటలు ఇండియన్స్ కి ఉన్నాయి. ఈ విషయాన్ని చాలా సందర్భాల్లో చాలా మంది ప్రూవ్ చేసుకున్నారు.
అలాగే అంతర్జాల సేవలను, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లని, ఆయా కంపెనీల పాలసీలకు విరుద్ధంగా ఇండియన్స్ ఉపయోగిస్తూ ఉంటారని టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే భారత్ లో గూగుల్ రిచ్ కమ్యూనికేషన్ సర్వీస్ మెసేజ్ సేవలను నిలిపివేస్తున్నట్లు తాజాగా వెల్లడించింది. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం భారత్ లో పలు వ్యాపార సంస్థలు, వ్యక్తులు ఆర్ సి ఎస్ ద్వారా యూజర్లకు మోసపూరితమైన ప్రకటనలను, గూగుల్ సంస్థ గుర్తించింది. దీంతో ఈ సేవలను తాత్కాలికంగా భారత్ లో నిలిపివేస్తున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది.

ఆర్ పి ఎస్ ద్వారా చాలా సంస్థలు యూజర్లకు ట్రావెల్ టికెట్ ను అలాగే గతంలో వారు కొనుగోలు చేసిన ఉత్పత్తులు ఆధారంగా ఉన్న లింక్లను పంపిస్తున్నారని గుర్తించారు. అలాగే ఈ ఆర్ పి ఎస్ మెసేజింగ్ సర్వీస్ ని చాలా కంపెనీలు గూగుల్ పాలసీకి విరుద్ధంగా ప్రమోషన్ ప్రకటనల కోసం వినియోగిస్తు న్నాయి అని గుర్తించారు.
వీటి ద్వారా చాలా మంది యూజర్స్ మోసపోతున్నారు అని సమాచారం గూగుల్ కి ఫీడ్ బ్యాక్ రూపంలో అందడంతో వారు ఈ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఈ ఆర్ పి ఎస్ సేవలను మరింత మెరుగు పరిచి అప్డేట్ ద్వారా యూజర్లకు మరింత భద్రత కల్పించే విధంగా తీసుకొస్తామని తెలిపారు. మొత్తానికి భారత్ వ్యాపార సంస్థల, సోషల్ మీడియా హ్యాకర్స్ కారణంగా గూగుల్ కూడా ఆర్ పి ఎస్ మెసేజింగ్ సర్వీస్ ల విషయంలో ఒక అడుగు వెనక్కి వేయడం గమనార్హం.