Google: కాంపిటీషన్ కమీషన్ ఆఫ్ ఇండియా ,CCI సెర్చ్ దిగ్గజంపై “దుర్వినియోగం” అని పేర్కొన్నందుకు జరిమానా విధించిన తర్వాత, భారతీయ డెవలపర్లు తమ అంతర్గత బిల్లింగ్ విధానాన్ని అవలంబించాలనే డిమాండ్‌ను నిలిపివేస్తున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ గూడ్స్, సర్వీసెస్, ట్రాన్సాక్షన్స్ కోసం భారతదేశంలోని వినియోగదారులు గూగుల్ ప్లే స్టోర్ విధానాలకు కట్టుబడి బిల్లింగ్ సిస్టమ్ ను ఉపయోగించాల్సి ఉంటుందని ఈ సాంకేతిక దిగ్గజం ముందుగా అక్టోబర్ 31 ని డెడ్‌లైన్‌గా నిర్ణయించింది.
సీసీఐ తాజాగా ఇచ్చిన తీర్పును అనుసరించి మేము ఈ డిమాండ్‌ను అమలు చేయడానికి పాజ్ ఇస్తున్నామని మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్‌లో గూగుల్ పేర్కొంది.
అయితే ఇది చట్టపరమైన ఎంపికలను సమీక్షిస్తుందని ఆండ్రాయిడ్ ప్లేలో పెట్టుబడులు పెట్టడాన్ని కొనసాగిస్తుందని నిర్థారించింది. భారతదేశం వెలుపల ఉన్న వినియోగదారులు డిజిటల్ కంటెంట్ పర్చేస్ కోసం గూగుల్ ప్లే బిల్లింగ్ సిస్టమ్‌ను ఉపయోగించాల్సిన ఉంటుందని తెలిపింది.
ప్లే స్టోర్ విధానాలకు సంబంధించి దాని ఆధిపత్య స్థానాన్ని దుర్వినియోగం చేసినందుకు గాను ఈ ఏడు అక్టోబర్ 25 న, భారతదేశం యొక్క యాంటీట్రస్ట్ రెగ్యులేటర్ గూగుల్ పైన రూ. 936.44 కోట్ల పెనాల్టీని విధించింది. అంతే కాదు ఈ అంశంపై సరైన వివరణ ఇవ్వాలని ఆర్డర్ ను జారీ చేసింది.
ఈ సందర్భంగా ఏర్పడిన కమిషన్ కూడా మూడు నెలల్లోగా సవరణలు చేయాలని గూగుల్‌ను ఆదేశించింది. యాప్ స్టోర్‌లో థార్డ్ పార్టీ పేమెంట్ సర్వీసెస్ ను ఉపయోగించడానికి అనుమతించిన మొబైల్ యాప్ డెవలపర్‌లను గురించి కూడా ఇందులో మెన్షన్ చేశారు. అంతకు ముందు గూగుల్ తన ప్లే స్టోర్ విధానాలకు అనుగుణంగా లేని ఏదైనా యాప్ జూన్ 1 నుండి గూగుల్ ప్లే నుంచి తీసివేయబడు తుందని పేర్కొంది. అయితే, అమెరికన్ కంపెనీ భారతదేశంలో డెవలపర్‌లకు అక్టోబర్ 31, 2022 వరకు కట్టుబడి ఉండటానికి అదనపు పొడిగింపును ఇచ్చింది. గత వారం CCI ఆర్డర్‌ను అనుసరించి తదుపరి దశలను మూల్యాంకనం చేయడానికి సమీక్షిస్తున్నట్లు గూగుల్ తెలిపింది.