Gongura: ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్న సంగతి అందరికీ తెలిసిందే కానీ చాలామంది ఆకుకూరలు తినడానికి ఏమాత్రం ఇష్టం చూపరు. ఇక ఆకుకూరలలో ఎంతో ఔషధ గుణాలు కలిగినటువంటి వాటిలో గోంగూర ఒకటి. చాలామంది గోంగూర తినడానికి ఏమాత్రం ఇష్టపడరు. ఇకపోతే గోంగూరను చాలామంది వివిధ రకాలుగా తయారు చేసుకుంటూ ఉంటారు కొందరు పచ్చడి చేయడం మరికొందరు రోటి పచ్చడి చేస్తూ ఉంటారు అలాగే చికెన్ మటన్ లోకి కూడా గోంగూర వేస్తూ ఉంటారు.
ఇలా గోంగూరని ఎన్ని విధాలుగా తయారు చేసిన చాలా మంది గోంగూర పక్కన పెడుతున్నారు అంటే మీరు ఎన్నో ప్రయోజనాలు కోల్పోయినట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గోంగూరలో విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ బి 1, విటమిన్ బి2 , విటమిన్ బి 9, మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం, ఐరన్, రైబోఫ్లేవిన్, కెరోటిన్‌లు ఉన్నాయి. మనకు రోజూవారీగా కావాల్సిన విటమిన్ సిలో 53 శాతం గోంగూరలో ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి, వారంలో రెండు సార్లైనా గోంగూర తింటే చాలా మంచిది.
గోంగూర హైబీపిని పూర్తిగా కంట్రోల్ చేస్తుంది. దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధపడేవారికి గోంగూర ఉపశమనం కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడేవారు గోంగూర తినడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. గోంగూరలో ఉండే క్లోరోఫిల్స్ క్యాన్సర్ కణాల పెరుగుదలని కంట్రోల్ చేస్తాయి. కాబట్టి, ఈ గోంగూరని హ్యాపీగా తినొచ్చు. అంతే కాకుండా దీనిని పులిహోరలా చేసుకుని కూడా తినొచ్చు. గోంగూర నుంచి తీసిన జిగురును నీటిలో కలిపి తాగితే విరేచనాలు తగ్గుతాయి. ఇక మహిళలకు నెలసరి సమయంలో వచ్చే నొప్పి నుంచి గోంగూర పూర్తిగా ఉపశమనం కలిగిస్తుందని చెప్పాలి.