General News: పుట్టుకతోనే ఎవరూ గొప్పవారు కాదు. ప్రతి ఒక్కరి జీవితం అమ్మ గర్భంలోనే మొదలైంది. అనాగరికంగానే మొదలైంది. అయితే ఎప్పుడు ప్రపంచంలో మనం మాట్లాడుకుంటున్న, ఏంతో మంది మేధావులు, ప్రస్తుతం ప్రపంచాన్ని శాసిస్తున్న ధనవంతులు, మనం దైవంగా ఆరాధించే దేవుళ్ళు అయిన అందరి ఒకే విధంగా ప్రయాణం మొదలు పెట్టారు. ఎదిగే క్రమంలో వారి ఆలోచనలతో ఒక్కో దిశలో జీవన గమనాన్ని మార్చుకున్నారు. వారు ఎంచుకున్న రంగంతో, నమ్మిన సిద్దాంతంతో, మార్చుకున్న ఆలోచనతో ఈ ప్రపంచం గుర్తుంచుకునే స్థాయికి వెళ్ళారు. చరిత్రలో వారి గురించి చర్చించుకునే వ్యక్తులుగా మారిపోయారు. ఈ గుర్తింపు ఏమీ వారికి అంత సులభంగా ఏమీ రాలేదు. ఎలాంటి కష్టం, నష్టం లేకుండా ఎదగలేదు. అయితే వారందరూ వారు ఎంచుకున్న మార్గంలో గప్ప మార్గదర్శకులుగా నిలవడానికి కారణం ఏమై ఉంటుంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే. భయాన్ని దాటుకొని, బలహీనతని వదులుకొని చేసిన ప్రయాణమే వారి స్థాయిని ఈ ప్రపంచానికి పరిచయంచేసింది.
పుట్టినప్పటి నుంచి సమాజం చాలా రకాల భయాలని పరిచయం చేస్తుంది, మనల్ని మానసికంగా బలహీనులుగా మార్చేస్తుంది. ఆ సమాజంలో తల్లిదండ్రులు ఉంటారు, బంధువులు ఉంటారు. స్నేహితులు ఉంటారు. మన చుట్టూ ఉన్న ఆ నలుగురు ఉంటారు. వీరే మనల్ని గొప్పవాళ్ళుగా నిత్యం అడ్డుకుంటూ ఉంటారు. సమాజంలో తరతరాలుగా మానసిక పొరల్లో గూడుకట్టుకొని ఉన్న కొన్ని భయాలు మనతో పాటు మన చుట్టూ ఉన్నవారిని కూడా ముందుకి కదలకుండా నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. తల్లిదండ్రులు తమకి పుట్టిన పిల్లలకి మొదటి గురువులు. వారిని చూసే అన్ని పిల్లలు మూడేళ్ళ వరకు నేర్చుకుంటారు. అయితే ఇక్కడే కొన్ని భయాలని పిల్లలలో పెంపొందించే ప్రయత్నం తల్లిదండ్రులు చేస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఒక పని చేసే ప్రయత్నం చేస్తారు. అయితే వారికి నచ్చని పని పిల్లలు చేస్తూ ఉంటే దానిని ఆపడానికి పిల్లలకి ఒక భయాన్ని పరిచయం చేస్తారు.
ఇక ఎదిగే క్రమంలో స్నేహితులు పలానా ఇంగ్లీష్ మన భాష కాదు, మాట్లాడటం కష్టం, హిందీ మన భాష కాదు నేర్చుకోవడం కష్టం. అమ్మో లెక్కల అవి అస్సలు అర్ధం కావు అంటూ నెగిటివ్ ఐడియాలజీని వారితో పాటు వారి చుట్టూ ఉన్న అందరిలో నింపేస్తారు. దీంతో ప్రతి సందర్భంలో భయం అనే మాట, కష్టం అనే మాట పదే పదే వినపడటం వలన మన మనస్సు దానికి ఎడిక్ట్ అయిపోతుంది. దీంతో భయపెట్టే విషయాలపై, కష్టం అనిపించే అంశాలపై మానసికంగా శ్రద్ధ పెట్టలేము. ఎప్పుడైతే మానసికంగా శ్రద్ధ పెట్టాలేమో అప్పుడే లైఫ్ లో ముందుకి వెళ్ళలేక ఒకేచోట నిలబడిపోతాం. అయితే చాలా మంది ఇక్కడ ఒక మాట చెబుతారు. రిస్క్ చేస్తేనే లైఫ్ లో ముందుకి వెళ్ళగలం అని అంటూ ఉంటారు. రిస్క్ అనే సౌండ్ నెగిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. అందుకే సమాజంలో 80 శాతం మంది రిస్క్ అనే మాటకి భయపడి ప్రయత్నం ఆపేస్తారు. దీంతో ముందుకి వెళ్ళలేక ఎలాగోలా బ్రతికేస్తారు. అయితే ప్రపంచంలో ఏది సాధించడానికి రిస్క్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం భయాన్ని దాటుకొని ముందుకి వెళ్తే సరిపోతుంది.
భయపెట్టే విషయం గురించి ఆలోచిస్తున్నంత సేపు అది భయపెడుతూనే ఉంటుంది. అయితే ఆ భయం అనే భావనని దూరం చేసుకుంటే మన ప్రయాణంలో ఎలాంటి రిస్క్ లేకుండానే ఎక్కడికి వెళ్లాలని అనుకుంటే అక్కడికి వెళ్లిపోవచ్చు. ప్రపంచానికి మనల్ని మనం గొప్పగా పరిచయం చేసుకోవడానికి గొప్ప బాటలు వేసుకోగలం. రిస్క్ అనేది మన కెపాసిటీని పరిచయం చేస్తుంది.జీవితంలో భయపెట్టే విషయాన్ని గాలికి వదిలేసి ముందుకెళ్ళిపోతే అది ఎప్పటికి మళ్ళీ మనకి ఎదురుకాదు. కష్టం అనే ఆలోచనని వెనక వదిలేస్తే మన ముందు ఎక్కడ మళ్ళీ అది కనిపించదు. వదిలేయ్ అనే మాట చాలా చిన్నగా కనిపిస్తుంది…. కాని జీవితాన్ని ప్రశాంతంగా ముందుకి వెళ్ళేలా చేస్తుంది.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.