Gehna Sippy: ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లోకి కొత్త కొత్త అందాలు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. చిన్న సినిమాలతో వచ్చిన అవకాశాలని వినియోగించుకొని తరువాత సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణించాలని కలలు కంటున్నారు. కొంత మంది హీరోయిన్స్ వచ్చిన అవకాశాలని వినియోగించుకొని స్టార్ హీరోయిన్స్ అవుతున్నారు.
అలా వచ్చిన అందాల భామలలో గెహనా షిప్పి కూడా ఒకరు. ఈ అమ్మడు మోడలింగ్ తో కెరియర్ స్టార్ట్ చేసి తరువాత డాన్సర్ గా సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక చోర్ బజార్ అనే సినిమాలో ఆకాష్ పూరితో హీరోయిన్ గా తెలుగులోకి అడుగుపెట్టింది. అయితే ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాలేదు.
ఇక తర్వాత సుడిగాలి సుదీర్ హీరోగా తెరకెక్కిన గాలోడు సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ కొట్టేసింది. ఈ మూవీ హిట్ టాక్ ని సొంతం చేసుకుంది. ఈ మూవీ తర్వాత అమ్మడు తెలుగులో బిజీ కావడం ఖాయంగా కనిపిస్తుంది. చిన్న సినిమాలకి ఈ బ్యూటీ అందం, ఆకర్షణం కచ్చితంగా బెస్ట్ ఛాయస్ అవుతుందని చెప్పొచ్చు.
ఇక అందాల భామలు సోషల్ మీడియాలో ఎప్పుడూ కూడా యాక్టివ్ ఉంటారనే సంగతి తెలిసిందే. సినిమాలలో నటించడం ద్వారా వచ్చే ఇమేజ్ కంటే వీరికి సోషల్ మీడియాలో అందాల ప్రదర్శనతో ఎక్కువ ఇమేజ్ వస్తుంది. గ్లామర్ షో ద్వారా ఫ్యాన్ ఫాలోయింగ్ ని కూడా పెంచుకుంటారు.
తాజాగా అందాల భామ గెహనా షిప్పి కూడా అదే రేంజ్ లో అందాల ప్రదర్శన చేస్తూ సోషల్ మీడియాలో హాట్ ఫోటోలని షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. వైట్ స్కర్ట్ లో థైస్ అందాలు కనిపించే విధంగా ఈమె అందాల ప్రదర్శన కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది.

