Wed. Jan 21st, 2026

    Health Tips: చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సమస్యలలో గ్యాస్ట్రిక్ సమస్య ఒకటి. అయితే మనం తీసుకొని ఆహారం కారణంగా ఇలా తరచూ గ్యాస్ సమస్యతో బాధపడుతూ ఉంటాము అయితే ఈ విధమైనటువంటి సమస్యలు తలెత్తినప్పుడు కేవలం ఇంట్లోనే సింపుల్ చిట్కాలు ఉపయోగించి ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. రెండు నిమిషాలలో తయారు చేసుకుని ఈ డ్రింక్ తాగటం వల్ల నిమిషాలలో ఈ గ్యాస్ట్రిక్ సమస్య తగ్గుతుంది.

    gastric-problems-and-abdominal-discomfort
    gastric-problems-and-abdominal-discomfort

    గ్యాస్ట్రిక్ సమస్య నుంచి ఉపశమనం పొందేవారు ఏ విధమైనటువంటి డ్రింక్ తాగాలి దానిని ఎలా తయారు చేసుకోవాలి అనే విషయానికి వస్తే…ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒకటిన్నర గ్లాస్‌ వాటర్ పోసుకోవాలి. వాటర్ కాస్త హీట్ అవ్వగానే ఒక చమోమిలే టీ బ్యాగ్ ను అందులో వేసుకోవాలి. అలాగే వన్‌ టేబుల్ స్పూన్ అల్లం తురుము,వన్ టేబుల్ స్పూన్ సోంపు గింజలు, నాలుగు ఫ్రెష్ పుదీనా ఆకులు వేసి మరిగించాలి. దాదాపు పది నిమిషాల పాటు మరిగిస్తే మన డ్రింక్ రెడీ అవుతుంది.

    ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ డ్రింక్ వడపోసుకుని గోరువెచ్చగా తాగటం వల్ల గ్యాస్ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే ఈ డ్రింక్ అజీర్తి, కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి సమస్యలను తరిమి తరిమి కొడుతుంది. మలబద్ధకం సమస్యను సైతం నివారిస్తుంది. నిత్యం గ్యాస్ సమస్యతో బాధపడేవారు రోజు ఉదయం పరగడుపున ఒక గ్లాస్ ఈ డ్రింక్ తాగటం వల్ల పూర్తిగా ఈ సమస్య నుంచి బయటపడటమే కాకుండా జీర్ణ వ్యవస్థ కూడా ఎంతో మెరుగుపడి ఇలాంటి సమస్యలకు కారణం కాకుండా ఉంటుంది.