Garlic: మనం వంటల్లో ఉపయోగించే పప్పు దినుసులు, మసాలా దినుసులు వల్ల ఆహారం రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ప్రతిరోజు వెల్లుల్లిని వంటల్లో వేయటం వల్ల ఆహారం రుచికరంగా మారటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఉపయోగపడుతుంది. అయితే వంటల్లో మాత్రమే కాకుండా పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కూడా మరెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి పరగడుపున తినటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రక్తపోటు సమస్యతో బాధపడే వారికి పచ్చి వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పరగడుపున పచ్చి వెల్లుల్లి తినటం వల్ల రక్తపోటు సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే ప్రతిరోజు ఇలా పచ్చి వెల్లుల్లి తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ కూడా కరిగిపోయి శరీర బరువుని తగ్గిస్తుంది. అందువల్ల అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు పరగడుపున పచ్చి వెల్లుల్లి తినడం వల్ల బరువు తగ్గవచ్చు .
Garlic:
అలాగే పచ్చి వెల్లుల్లిలో ఎన్నో ఔషధ గుణాలు, పోషకాలు ఉంటాయి. క్యాన్సర్ నివారణలో కూడా వెల్లుల్లి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ కార్సినోజెనిక్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. క్యాన్సర్ నివారణలో ఇవి తోడ్పడతాయి. అందువల్ల ఉదయాన్నే ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తినటం మంచిది. అంతే కాకుండా వెల్లుల్లిలో ఉండే అల్లిసిన్ అనే సమ్మేళనం రక్తంలోని చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.అందువల్ల డయాబెటిస్ తో బాధపడేవారు ప్రతిరోజూ ఖాళీ కడుపుతో రెండు వెల్లుల్లి రెబ్బలు తినటం వల్ల మధుమేహ సమస్య నియంత్రణలో ఉంటుంది.