Thu. Jan 22nd, 2026

    Ganga Pushkaralu: మన సనాతన ధర్మంలో నందులకి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నదులు మన జీవన విధానంలో భాగం. త్రాగు నీరు, సాగు నీరు అందించడమే మాదు. ఆద్యాత్మికంగా మనల్ని మహోన్నతులుగా తీర్చి దిద్దడంలో నదుల పాత్ర ఉంది. అందుకే నదీ పరివాహక ప్రాంతాలలోనే ఎక్కువగా ప్రజలు ఆవాసాలు ఏర్పరుచుకొని సంఘాలుగా, సమాజంగా అభివృద్ధి చెందారు. భూమి లోపల నీరు ఉంటుందని తెలియని కాలంలో నదుల మీదనే సమస్త మానవ సమాజం నిలబడింది. అభివృద్ధి చెందింది. అందుకే నదులని దేవతా స్వరూపాలుగా మనం ఆరాధిస్తూ ఉంటాం.

    Book 5 Days Ganga Pushkaralu Tour Packages from Delhi

    ఎక్కడో అడవులలో పుట్టిన నదులు అలా వేల కిలోమీటర్ల ప్రవాహంతో ప్రయాణం చేస్తూ సముద్ర గర్భంలో కలుస్తాయి. ఈ నదుల ప్రవాహం కూడా ఆద్యాత్మిక అన్వేషణని మాత్రమే కాకుండా భౌతికపరమైన లక్ష్యంలో మనం అలవాటు చేసుకోవాల్సిన లక్షణాలని సూచిస్తాయి. నదీ జనాలు అడవులని చీల్చుకొని రావడంతో, ఎన్నో ఔషధ లక్షణాలు వాటికి ఉంటాయి. అందుకే నదులలో స్నానాలు చేస్తే ఆరోగ్యం పెరుగుతుంది అని నమ్మేవారు. ఒకప్పుడు మహర్షులు నదీస్నానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు.

    Ganga Pushkaralu & Kashi Tour 27-04-2023 - Raavov

    అయితే కాలక్రమంలో నదీ పరివాహక ప్రాంతాలలో ఉన్న వారు తప్ప ఎవ్వరూ అందులో స్నానాలు చేయడానికి కుదరడం లేదు. ఈ కారణంగా నదులకి ప్రతి 12 ఏళ్ళకి ఒకసారి పుష్కరాలు నిర్వహిస్తున్నారు. ఇలా పుష్కరాలతో అయిన నదీస్నానాలు చేస్తే పుణ్యఫలం సిద్ధిస్తుంది అనే విశ్వాసం ప్రజలలోకి బలంగా వెళ్ళడంతో పుష్కరాలలో పాల్గొనడానికి ప్రాధాన్యత ఇస్తారు. ఈ ఏడాది గంగానది పుష్కరాలు రాబోతున్నాయి. భారతీయ సనాతన ధర్మంలో గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. సాక్షాత్తు శివుని జటాజూటం నుంచి ఉద్భవించినదిగా భావిస్తారు. భగీరథుడు తపస్సు చేసి భూమిపైకి గంగని తీసుకొచ్చారని పురాణ కథలలో ఉంది.

    Impresiones de Varanasi - Banaras Agencia de Viajes en Alicante

    అలాగే మూడు లోకాలలో ప్రవహించే ఒకే ఒక్క నదిగా గంగానదికి ప్రత్యేక స్థానం ఉంది. అందుకే నదులలోకి శ్రేష్టమైనది గంగానది అని భారతీయుల విశ్వసిస్తూ ఉంటారు. ఏప్రిల్ 12 నుంచి మే 3 వరకు గంగానది పుష్కరాలు రాబోతున్నాయి. వీటిలో ప్రతి రోజు 25 లక్షల మంది పాల్గొంటారని అంచనా. అలాగే హిమాలయాల్లో తపస్సు చేసుకొని మునులు, అఘోరాలు గంగా పుష్కరాలలో పాల్గొంటారు. గంగానది పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక రైళ్ళు కూడా నడుపుతుంది. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా గంగా పుష్కరాలలో పాల్గొనడానికి బయలుదేరండి