Game Changer: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ జీనియస్ శంకర్ షణ్ముగ్ కాంబినేషన్‌లో రూపొందిన సినిమా ‘గేమ్ ఛేంజర్’. 2025 సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కి రెడీ అవుతోంది. దిల్ రాజు ఇప్పటి వరకు నిర్మించిన సినిమాలకంటే భారీ బడ్జెట్ దీనికి కేటాయించి అతిపెద్ద సాహసం చేస్తున్నారు. అందుకే, తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళం తో పాటు మిగతా సౌత్ భాషలలోనూ సినీ ప్రముఖులలో ఎంతో ఆసక్తి నెలకొంది.
శంకర్ సినిమా అంటే విపరీతమైన విజువల్ ఎఫెక్ట్స్ ఉంటాయని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లేటెస్ట్ టెక్నాలజీని ఆయన ఉపయోగించినంతగా మరో దర్శకుడు ఉపయోగించలేరని చెప్పవచ్చు. ఎంత టెక్నాలజీ వాడినప్పటికీ శంకర్ మొదటి సినిమా నుంచి గత చిత్రం భారతీయుడు 2 వరకూ ఆయన ఎంచుకునే సామాజిక అంశం మాత్రం కొత్తగా అనిపించదు. అయితే, ట్రీట్‌మెంట్ తో మెస్మరైజ్ చేస్తూ భారీ సక్సెస్‌లను చూశారు..అంతకన్నా అతి భారీ ఫేల్యూర్స్ ని చూశారు.
Game Changer: శంకర్ సినిమా అంటే హీరోలు, నిర్మాతలు మొహం చాటేశారు.
ఒకదశలో శంకర్ సినిమా అంటే హీరోలు, నిర్మాతలు మొహం చాటేశారు కూడా. గతకొంతకాలంగా ఆయన సక్సెస్ చూసింది లేదు. అయినా మన దిల్ రాజు గారు గట్స్ తో ‘గేమ్ ఛేంజర్’ చిత్రాన్ని నిర్మించడానికి చెన్నై వెళ్ళడం గొప్ప విషయం. మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని కొన్నిసార్లు శంకర్ ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు చరణ్ తో సినిమా అనేసరికి సహజంగానే అందరిలో ఆసక్తి కలిగింది.
అయితే, మన ఇండస్ట్రీలో ఒక దర్శకుడి మీద అలాగే, హీరో మీద గత చిత్ర సక్సెస్, ఫేల్యూర్ తాలూకా ప్రభావం గట్టిగా ఉంటుంది. ఇది ఎన్నోసార్లు ఎంతోమంది విషయంలో ప్రూవ్ అయింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సాలీడ్ సక్సెస్ అందుకున్న హీరోకి నెక్స్ట్ మూవీ ఫ్లాప్‌గా మిగిలిన ప్రచారం ఇప్పటికీ ఉంది. అది ఇటీవల ‘దేవర’ సినిమాతో తారక్ దాటేసి కొంత ఊరట కలిగించారు. ఇప్పుడు చరణ్ ఆ నెగిటివిటీ నుంచి తప్పించుకుంటారా..? అనేది అందరిలోనూ ఉన్న అత్యుత్సాహం.
శంకర్ హిట్ కొట్టి చాలాకాలమే అయింది. భారతీయుడు 2 ఉండదని అందరూ అనుకున్నారు. ‘గేమ్ ఛేంజర్’ సెట్స్‌పైకి వచ్చాక ఇదే సినిమా ఆయన నుంచి వస్తుందని భావించారు. అదే సమయంలో వివాదాల నుంచి బయటపడి ఒప్పందం ప్రకారం భారతీయుడు 2 కంప్లీట్ చేయాల్సి వచ్చింది. కట్ చేస్తే దారుణమైన డిజాస్టర్. అసలు ఇది శంకర్ సినిమానా..? అని పెద్ద డౌట్ క్రియేట్ అయింది. ఈ దెబ్బకి ‘గేమ్ ఛేంజర్’ మేకర్స్ లో కొంత ఒణుకుపుట్టిన మాట వాస్తవం.
ఒకవైపు జక్కన్న హిట్టిచ్చిన హీరోకి ఫ్లాప్ ఖాయం అనే టాక్..ఎటొచ్చి ‘గేమ్ ఛేంజర్’ హిట్టైనా, ఫ్లాపైనా శంకర్ కి పోయేదేమి లేదు, చరణ్ కి వచ్చేదేమీ లేదు..భారీగా నష్టాలను చూడాల్సి వచ్చేది మాత్రం దిల్ రాజు అండ్ కో అని వినబడుతుంది. ఇలా వినబడటానికి కారణం ఎప్పుడూ ప్రశాంతంగా నవ్వుతూ సక్సెస్ కొట్టే దిల్ రాజు కి ఆశించిన సక్సెస్‌లు లేకపోవడం ఇటీవల కాస్త ఫైర్ అవుతూ హర్ట్ అవుతుండటమే.
అన్నట్టు మెగాస్టార్ నటిస్తున్న ‘విశ్వంభర’ కూడా సంక్రాంతి నుంచి తప్పించమని రాజుగారు యూనిట్ సభ్యులను రిక్వెస్ట్ చేశారు. చిరు కూడా తనయుడి కోసం ఓ అడుగు వెనక్కి తగ్గి ‘గేమ్ ఛేంజర్’ ని ముందుకు నెట్టి సంక్రాంతి బరిలో నిలిపారు. కానీ, బాలయ్య ‘డాకూ మహారాజ్’..వెంకీ సంక్రాంతికి వస్తున్నాం అంటున్నారు కదా..వీళ్ళనైతే ఆపే ఛాన్స్ లేదు. కాబట్టి ‘గేమ్ ఛేంజర్’ ఏమవుతాడో చూడాలి.
ఇక ఇక్కడ బాగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ‘గేమ్ ఛేంజర్’ కోసం మెగాస్టార్ ‘విశ్వంభర’ చిత్రాన్ని పోస్ట్‌పోన్ చేయించిన దిల్ రాజు గారు ఆయన నిర్మాణంలో రూపొందుతున్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని ఇదే సంక్రాంతికి తీసుకురావడం. అంటే, వెంకటేశ్ సినిమా కాబట్టి అంత పోటీ ఉండదనా..లేక ఇది కూడా నా బ్యానర్ సినిమా కాబట్టి ఒకటైనా హిట్ కొడుతుందని ఆశతో ఉన్నారా అనేది ఓ వర్గం వాళ్ళలో సాగుతున్న చర్చ.