Fruits: సాధారణంగా ప్రతిఒక్కరు రోజు వారి ఆహారంలో భాగంగా పండ్లను తినడానికి ఎంతో ఆసక్తి చూపుతారు. మనలో వ్యాధి నిరోధక శక్తిని పెంచి సంపూర్ణ ఆరోగ్యాన్ని పరిరక్షించే అన్ని రకాల పోషకాలు పండ్లలో సమృద్ధిగా లభిస్తాయి.అందుకే ప్రతిరోజు ఏదో ఒక పండును ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతుంటారు. ఇలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న పండ్లను తినేటప్పుడు చాలా మంది ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరి ఆ పొరపాట్లు ఏంటీ అనే విషయానికి వస్తే…
ఉదాహరణకు యాపిల్, జామ, అవకాడో,పియర్, ద్రాక్ష,రేగు వంటి కొన్ని రకాల పండ్ల తొక్క భాగంలో మన శరీరానికి అవసరమైన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, రైబోఫ్లైవిన్, నికోటిన్ ఆమ్లం, పోలిక్ ఆమ్లం వంటి సూక్ష్మ పోషకాలతో పాటు స్థూల పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అందుకే ఈ పండ్లను తినే వారు తొక్క తీయకుండా తినడం ఎంతో మంచిది. ఈ పండ్లను తినేటప్పుడు శుభ్రంగా కడిగి తినడం అస్సలు మర్చిపోవద్దు. ఈపండ్లను పండించే సమయంలో ఎన్నో పెస్టిసైడ్స్ ఉపయోగించి ఉంటారు.
అరటిపండు, దానిమ్మ, బొప్పాయి, ఆరెంజ్, పుచ్చకాయ, కివి వంటి పండ్ల తొక్కలో కూడా చాలా పోషకాలు ఔషధ గుణాలు ఉంటాయి. అయితే వీటి తొక్కలను మనం నేరుగా తినడం చాలా కష్టం. కావున వీటిని మరిగించి వీటి కషాయాన్ని సేవించవచ్చు. ముఖ్యంగా దానిమ్మ, ఆరెంజ్ తొక్కలతో రుచికరమైన పానీయాన్ని తయారు చేసుకొని సేవిస్తే ఉబకాయం, గుండె జబ్బులు, డయాబెటిస్, రక్త పోటు వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చునని నిపుణులు చెబుతున్నారు.ఇలా పండ్లను తినేటప్పుడు ఈ జాగ్రత్తలను పాటించి తినడం వల్ల ఎన్నో అదనపు పోషకాలు మన శరీరానికి అందుతాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.