Wed. Jan 21st, 2026

    Fridge: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి ఇంట్లో మనకు కనిపించే వస్తువులలో ఫ్రిడ్జ్ కూడా ఒకటి. ఇలా ఫ్రిడ్జ్ ఇంట్లో ఉండటం వల్ల చాలామంది దానిని వివిధ రకాలుగా ఉపయోగిస్తూ ఉంటారు. కొంతమంది కూరగాయలు మిగిలిన ఆహార పదార్థాలను నిల్వ చేయక మరికొందరు ఇంటికి సంబంధించిన కొన్ని సరుకులను కూడా ఫ్రిజ్లోనే నిల్వ చేసుకుంటూ ఉంటారు.ఇలా ఫ్రిజ్లో నిల్వ చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు మళ్ళీ ఉంటాయని భావిస్తారు అయితే కొన్ని రకాల ఆహార పదార్థాలను మనం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన వెలువడుతుంది.

    ఈ విధమైనటువంటి దుర్వాసనను భరించడం కష్టతరంగా మారుతుంది. మరి ఫ్రిడ్జ్ నుంచి వెలువడే దుర్వాసనను పోగొట్టాలి అంటే కొన్ని చిట్కాలను పాటిస్తే చాలు ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటి అనే విషయానికి వస్తే…ఫ్రిడ్జ్ నుంచి విలువడే ఈ దుర్వాసనను పోగొట్టడం కోసం మనకు మార్కెట్లో ఫ్రిడ్జ్ క్లీనింగ్ సొల్యూషన్స్ అందుబాటులో ఉంటాయి. వీటి సహాయం మనం ఫ్రిడ్జ్ శుభ్రం చేసుకోవచ్చు. అలాగే మనం మిగిలిపోయిన ఆహార పదార్థాలను ఫ్రిజ్లో నిల్వ ఉంచినప్పుడు తప్పనిసరిగా వాటి నుంచి వాసన బయటకు రాకుండా ఉండడం కోసం బిగుతైన కంటైనర్లలో నిల్వ చేసి పెట్టాలి.

    Fridge:

    ఫ్రిడ్జ్ నుంచి దుర్వాసన రాకుండా ఉండాలి అంటే మన ఇంట్లోనే నిమ్మకాయ బేకింగ్ పౌడర్ తో కలిపి తయారు చేసిన ద్రావణం సహాయంతో శుభ్రం చేయటం వల్ల దుర్వాసనను పోగొడుతుంది. ఇక వెనిగర్ ను తీసుకొని నీటిలో ఉడకబెట్టి ఆపై ఐదు నుంచి ఆరు గంటలపాటు ఫ్రిజ్లో నిల్వ ఉంచడం వల్ల ఫ్రీజ్ నుంచి వచ్చే మసాలా వాసన అలాగే దుర్వాసనను వెనిగర్ గ్రహిస్తుంది. ఇక ఆపిల్ సైడర్ వెనిగర్ ఫ్రిడ్జ్ లో ఉంచడం వల్ల ఫ్రిడ్జ్ తాజా పండ్ల సువాసనతో వెదజల్లుతుంది.