Thu. Jan 22nd, 2026

    Foot Care:  వర్షాకాలం మొదలవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుముడుతూ ఉంటాయి.వర్షాకాలం రావడంతో తరచూ వర్షాలు పడటం వల్ల నేల మొత్తం చిత్తడిగా ఉంటుంది దీంతో మనం తరచూ మన విధులకు వెళ్లే సమయంలో పాదాలు వర్షపు నీటిలో తడవాల్సి ఉంటుంది. ఇలా తేమలో ఎక్కువగా తడవడం వల్ల పాదాల పగులు రావడంతో పాటు ఎన్నో రకాల ఇన్ఫెక్షన్లు సోకుతాయి. అందుకే వర్షాకాలం నుంచి పాదాలను రక్షించుకోవాలి అంటే చిట్కాలను పాటిస్తే చాలు ఆరోగ్యవంతమైన పాదాలు మీ సొంతమవుతాయి.

    వర్షాకాలంలో అధికంగా తేమలో నడవడం వల్ల కొన్ని సార్లు పాదాలు దురద పెడుతూ ఉంటాయి. ఇలా దురద పెడుతున్న చోట వెనిగర్ నిమ్మరసం కలిపి రాయడం వల్ల దురద తగ్గుతుంది. అదేవిధంగా ప్రతిరోజు రాత్రి పడుకునే సమయంలో గోరువెచ్చని నీటిలో కడిగి కొద్దిగా కొబ్బరి నూనె వేసి బాగా మర్దన చేయాలి. అదేవిధంగా ప్రతిరోజు మాయిశ్చరైజర్ తప్పకుండా రాసుకోవాలి. పాదాలకు పగుళ్లు వచ్చే అవకాశం ఎక్కువ కాబట్టి మృతచర్మం తొలగిపోయేలా స్క్రబ్బర్‌తో రుద్దాలి. డెడ్ స్కిన్‌ను తొలగిస్తే పాదాల పగుళ్లు త‌గ్గుతాయి.

    Foot Care: 

    కొంతమంది చెప్పులు లేకుండా తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ పాదాలు చాలా మురికిగా ఉంటాయి. ఇలా పాదాలు మురికిగా ఉన్నవారు రోజ్‌ వాటర్‌, గ్లిజరిన్ ఈక్వ‌ల్‌గా తీసుకొని రాత్రివేళ పాదాలకు మర్దన చేసి మార్నింగ్ గోరువెచ్చటినీళ్లలో షాంపూ కలిపి శుభ్రం చేసుకోవడం వల్ల పాదాలపై ఉన్నటువంటి మురికి మొత్తం తొలగిపోతుంది. గోర్లు ఎక్కువగా ఉండటంవల్ల దుమ్ముదులి కాలిలోకి వెళ్లి ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం ఉంటుంది ఇలా ఈ జాగ్రత్తలను తీసుకోవడం వల్ల వర్షాకాలంలో మనకు మన పాదాలను సంరక్షించుకోవచ్చు.