Flax Seeds: అవిసె గింజల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటిని తరచుగా తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతూ ఉంటారు. అవిసె గింజలు శరీరంలోని మెటబాలిజం రేటును పెంచుతాయి. అలాగే జీర్ణ సమస్యలను కూడా తగ్గిస్తాయి. అవిసె గింజలు శరీరంలో ఉన్న చెడు కొలస్ట్రాల్ ను కరిగిస్తాయి. దాంతో త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అవిసె గింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. తక్కువ కేలరీలు ఉంటాయి. అలాగే అవిసె గింజల్లో ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. ముఖ్యంగా అవిసె గింజలు బరువు తగ్గించడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. ఎంత లావు ఉన్నవారైనా సరే నెల రోజులపాటు అవిసె గింజలను తీసుకుంటే చాలు దాదాపుగా 20 కేజీల వరకు బరువు తగ్గవచ్చు. మరి అందుకోసం అవిసె గింజలను ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. అందుకోసం అవిసె గింజలతో పాటు జీలకర్ర, కరివేపాకును సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం జీలకర్ర వేసి కొన్ని అవిసె గింజలు వేయాలి. కొంత సేపు బాగా కలిపిన తర్వాత కొన్ని కరివేపాకు ఆకులు వేయాలి. కొంచెం సేపు బాగా వేయించాక ఆ మిశ్రమాన్ని తీసుకొని మిక్సీలో పొడిగా చేయాలి.
ఆ పొడిని గోరు వెచ్చని నీటిలో కలుపుకొని నిత్యం తీసుకుంటే శరీరంలో ఉన్న అధిక కొవ్వు, అనవసర కొవ్వు కరుగుతుంది. దాంతో త్వరగా బరువు తగ్గుతారు. ఒక నెల రోజుల పాటు నిత్యం దీన్ని తీసుకుంటే కనీసం 20 కిలోల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పొడిని తీసుకోవడం వల్ల కేవలం అధిక బరువును తగ్గడమే కాదు, మలబద్ధకం తగ్గిస్తుంది. శరీరంలోని వ్యర్థ పదార్థాలు, విష పదార్థాలను నాశనం చేస్తుంది. ఊబకాయం సమస్య తగ్గుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగు పడుతుంది. అందుకే కేవలం బరువు తగ్గడం కోసమే కాదు. ఇతర సమస్యలు ఉన్నా కూడా అవిసె గింజలతో చేసిన పొడిని నిత్యం తీసుకుంటే ఆరోగ్యంగా ఉండవచ్చు.