Fish: సాధారణంగా మనం కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్న తర్వాత మరికొన్ని ఆహార పదార్థాలను తినకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇలా తినడం వల్ల మనం తీసుకున్న ఆహార పదార్థాలు విష పదార్థాలుగా మారుతాయని చెబుతుంటారు అయితే చేపలు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితులలో కూడా పాలు లేదా పాల పదార్థాలను తినకూడదని పెద్దవారు చెబుతున్నారు. మరి నిజంగానే చేప తిన్న తర్వాత పాల పదార్థాలను తినకూడదా తింటే ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే…
ఆయుర్వేద శాస్త్రం ప్రకారం చేపలున్న తిన్న తర్వాత పాల పదార్థాలను తినడం వల్ల కొందరిలో ల్యూకోడెర్మా అనే అనారోగ్య స్థితి రావచ్చని చెబుతున్నారు. ల్యూకోడెర్మా అనగా చర్మంపై తెల్లని మచ్చలు ఏర్పడటం. అయితే ఇది అందరిలోనూ వస్తుందని గ్యారెంటీ లేదు.
కొన్నిసార్లు చేపలు అసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటాయి, పాలు ఆల్కలైన్ స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఈ క్రమంలో రెండింటినీ కలిపి తీసుకుంటే గ్యాస్టిక్ సమస్యలు వస్తాయి.
Fish: చేపలు తిన్న తర్వాత…
చేపలు, పాల ఉత్పత్తులలో అధిక ప్రోటీన్లు ఉంటాయి. రెండింటిని కలిపి తీసుకుంటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. దీనివల్ల గ్యాస్, డయేరియా తదితరులు సమస్యలు వస్తాయి అయితే కొందరికి చేపలు తిన్న వెంటనే పాలు తాగడం వల్ల వారి శరీర తత్వానికి సరిపడకం చర్మంపై అలర్జీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు అందుకే ఎక్కువగా చేప తిన్న వెంటనే పాలు లేదా పాల పదార్థాలను తినకూడదని ఇలా తినక పోవడమే మంచిదని ఆరోగ్యనిపుణులు తెలియజేస్తున్నారు.