Vastu Tips: మన భారతీయ సంస్కృతిలో పసుపుకి చాలా ప్రాముఖ్యత ఉంది. పసుపుని శుభకార్యాలలో పవిత్రతకు సూచికగా భావిస్తారు. అందువల్ల ఏదైనా శుభకార్యాలు జరిగేటప్పుడు పసుపు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. అంతేకాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.అందువల్ల మనం తినే ఆహార పదార్థాలలో పసుపుని ఎక్కువగా ఉపయోగిస్తారు. అలాగే ఆయుర్వేదంలో కూడా పసుపుని విరివిగా ఉపయోగిస్తారు. ఇలా పసుపుని ఎన్నో విధాలుగా ఉపయోగిస్తారు.
అలాగే వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని వాస్తు దోషాల వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. అయితే ఆర్థిక సమస్యల నుండి విముక్తి పొందటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఫలితం ఉండదు. అటువంటి సమయంలో పసుపు ఎంతో ఉపయోగపడుతుంది. పసుపు ఉపయోగించి చేసే ఒక చిన్న పని వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. లక్ష్మీదేవిని సంపదకు భావిస్తారు. అందువల్ల లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుతో పూజించటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
ప్రతి శుక్రవారం రోజున ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకుని లక్ష్మీదేవిని అందంగా అలంకరించి పసుపు సమర్పించాలి. అలాగే పసుపులో గంగాజలం కలిపి పూజ గదిలో స్వస్తిక్ గుర్తు వేయాలి. అలాగే ఇంటి ముఖ ద్వారం ముందు కూడా పసుపుతో ఎలా స్వస్తిక్ ఓం గుర్తులు వేయటం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఆర్థిక సమస్యలు దూరం అవుతాయి. అంతేకాకుండా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించకుండా ఉంటుంది.