Fatigue Symptoms: సాధారణంగా ఒక మనిషి అలసిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే విషయమే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు తప్పకుండా మనిషికి అలుపు వస్తుంది. కానీ చిన్న చిన్న పనులు చేస్తున్న కూడా తొందరగా అలుపు వస్తుంది ఇలా చిన్న పనులకే అలసిపోతున్నారు అంటే దానిని సాధారణ అంశంగా భావించకూడదు ఇలా చిన్న పనులకు అలసిపోతున్నారు అంటే మీరు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. మరి ఇలా తరచూ అలసిపోతూ ఉండడానికి గల కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే…
మనం పగలు చిన్న పనులకి అలసిపోతున్నాము అంటే రాత్రిపూట సరైన నిద్ర లేదని అర్థం అందుకే ప్రతిరోజు తప్పకుండా 8 గంటల పాటు నిద్రపోవడం ఎంతో అవసరం ఇలా నిద్రపోయినప్పుడే మనకు అలసట అనేది రాదు. ఇక ఎప్పుడైతే మన శరీరంలో రక్త కణాల సంఖ్య తగ్గిపోతాయో ఆ సమయంలో మనం రక్తహీనత సమస్యతో బాధపడతాము ఇలా రక్తహీనత సమస్యతో బాధపడేవారు చిన్న పనులకే అలసిపోవడం జరుగుతుంది. ఇలా రక్తహీనత సమస్యతో బాధపడేవారు ఎక్కువగా విటమిన్ బి12 ఐరన్ ఉన్న పోషక పదార్థాలను అలాగే వాటిని సప్లిమెంటరీ రూపంలో తీసుకోవడం మంచిది.
Fatigue Symptoms:
ఇక థైరాయిడ్ సమస్యలతో బాధపడే వారిలో కూడా ఈ అలసట తొందరగా వస్తుంది. థైరాయిడ్ తక్కువగా ఉన్నవారిలో, శరీరంలోని జీవక్రియ మందగిస్తుంది. దీనివల్ల నీరసంగా అనిపించవచ్చు. థైరాయిడ్ ఎక్కువగా ఉన్నవారిలో, శరీరం జీవక్రియ వేగవంతం అవుతుంది. ఈ ఓవర్ యాక్టివిటీ కూడా అలసటకు దారితీస్తుంది. ఇక మధుమేహ సమస్యతో బాధపడే వారిలో కూడా తొందరగా అలుపు వస్తుందని ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు చిన్న చిన్న పనులు చేయడం వల్ల కూడా అలసిపోతుంటారు అందుకే మీరు చిన్న పనులకే అలసిపోతూ ఉంటే కనుక ఒకసారి డాక్టర్ ను సంప్రదించి పరీక్షలు చేయించుకోవడం ఎంతో మంచిది.