Samantha : సమంత కెరీర్ గురించి ఆమె అభిమానులు తెగ బెంగపెట్టుకుంటున్నారు. అనవసరమైన ప్రాజెక్ట్స్ కమిటై కెరీర్‌ని బాగా డ్యామేజ్ చేసుకుంటున్నారని వాపోతున్నారు. మజిలీ, ఓ బేబీ సినిమాల తర్వాత సమంత సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇలాంటి స్టార్ హీరోయిన్‌కి వరుస ఫ్లాపులంటే స్వయంకృతాపరాధమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న సమంత వరుసగా భాషతో సంబంధం లేకుండా ప్రాజెక్ట్స్ కమిటైంది.
అవి చూసి జనాలందరూ సామ్ దూకుడు మామూలుగా లేదని చెప్పుకున్నారు. కానీ, అమ్మడి సినిమాలు ఎందుకో సక్సెస్ సాధించడం లేదు. కథు వాక్కుల రెండు కాదల్, యశోద, శాకుంతలం..ఇలా భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోతున్నాయి. బాలీవుడ్‌లో చేసిన వెబ్ సిరీస్ మినహా మూవీస్ మాత్రం సమంత కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు.
దీనికి కారణం ఎవరి మీదనో పంతం కొద్దీ చక చకా సినిమాలను సైన్ చేసి మంచి కథలను ఒప్పుకోకపోవడమే. ఇప్పుడిదే సమంత కెరీర్ గ్రాఫ్ బాగా డ్రాపవడానికి కారణం అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది తప్ప తెలుగులో సమంతకి మరో సినిమా లేదు. బాలీవుడ్‌లో మాత్రం కొన్ని ప్రాజెక్ట్స్ కమిటైంది. మరి బాలీవుడ్‌లో సమంత ఏ మేరకి సక్సెస్ అవుతుందో చూడాలి.
ఒకప్పుడు సమంత అంటే లక్కీ హీరోయిన్ అనే పేరుండేది. ఈ బ్యూటీ ఏ సినిమా చేసిన అది మంచి కమర్షియల్ హిట్ సాధించేది. తమిళంలో సమంతకి స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా సమంతకి సినిమా ఛాన్సులు లేవు. మరి అమ్మడి ఫేట్ ఎప్పుడు చూడాలి. సమంత అభిమానులకి మాత్రం మళ్ళీ సాలీడ్ సక్సెస్‌లు అందుకోవాలని కోరుకుంటున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.