Thu. Jan 22nd, 2026

    Samantha : సమంత కెరీర్ గురించి ఆమె అభిమానులు తెగ బెంగపెట్టుకుంటున్నారు. అనవసరమైన ప్రాజెక్ట్స్ కమిటై కెరీర్‌ని బాగా డ్యామేజ్ చేసుకుంటున్నారని వాపోతున్నారు. మజిలీ, ఓ బేబీ సినిమాల తర్వాత సమంత సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. ఇలాంటి స్టార్ హీరోయిన్‌కి వరుస ఫ్లాపులంటే స్వయంకృతాపరాధమే అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్యతో విడాకులయ్యాక కొంత గ్యాప్ తీసుకున్న సమంత వరుసగా భాషతో సంబంధం లేకుండా ప్రాజెక్ట్స్ కమిటైంది.

    అవి చూసి జనాలందరూ సామ్ దూకుడు మామూలుగా లేదని చెప్పుకున్నారు. కానీ, అమ్మడి సినిమాలు ఎందుకో సక్సెస్ సాధించడం లేదు. కథు వాక్కుల రెండు కాదల్, యశోద, శాకుంతలం..ఇలా భారీ అంచనాల మధ్య రిలీజైన సినిమాలన్నీ అడ్రస్ లేకుండా పోతున్నాయి. బాలీవుడ్‌లో చేసిన వెబ్ సిరీస్ మినహా మూవీస్ మాత్రం సమంత కెరీర్‌కి ఏమాత్రం ఉపయోగపడలేదు.

    Fans who are upset about Samantha's career.. why do you like such films..?
    Fans who are upset about Samantha’s career.. why do you like such films..?

    Samantha : సమంత అంటే లక్కీ హీరోయిన్..

    దీనికి కారణం ఎవరి మీదనో పంతం కొద్దీ చక చకా సినిమాలను సైన్ చేసి మంచి కథలను ఒప్పుకోకపోవడమే. ఇప్పుడిదే సమంత కెరీర్ గ్రాఫ్ బాగా డ్రాపవడానికి కారణం అంటున్నారు. ప్రస్తుతం తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది తప్ప తెలుగులో సమంతకి మరో సినిమా లేదు. బాలీవుడ్‌లో మాత్రం కొన్ని ప్రాజెక్ట్స్ కమిటైంది. మరి బాలీవుడ్‌లో సమంత ఏ మేరకి సక్సెస్ అవుతుందో చూడాలి.

    ఒకప్పుడు సమంత అంటే లక్కీ హీరోయిన్ అనే పేరుండేది. ఈ బ్యూటీ ఏ సినిమా చేసిన అది మంచి కమర్షియల్ హిట్ సాధించేది. తమిళంలో సమంతకి స్టార్ హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉండేది. ఇప్పుడు అక్కడ కూడా సమంతకి సినిమా ఛాన్సులు లేవు. మరి అమ్మడి ఫేట్ ఎప్పుడు చూడాలి. సమంత అభిమానులకి మాత్రం మళ్ళీ సాలీడ్ సక్సెస్‌లు అందుకోవాలని కోరుకుంటున్నారు.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.