YSRCP: ఏపీ రాజకీయాలలో అధికార పార్టీ వైసీపీ ప్రస్తుతం చక్రం తిప్పుతున్న సంగతి తెలిసిందే. అయితే వైసీపీలో 154 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఎవరికీ స్వేచ్చగా మాట్లాడే హక్కు లేదనేది రాజకీయ వర్గాలలో వినిపించే మాట. అలాగే పేరుకే మంత్రులు ఉన్నారు తప్ప వారి శాఖల గురించి చాలా మందికి తెలియదని, అసలు వారి శాఖలకి సంబందించిన చేపట్టాల్సిన రివ్యూలు కూడా చేరరనేది జగమెరిగిన సత్యం. మీడియా ముందుకి వచ్చినా ఇప్పటి చంద్రబాబు పాలనలో అలా జరిగింది, ఇలా జరిగింది అని విమర్శలు చేయడం తప్ప పెద్దగా తాము చేస్తున్న అభివృద్ధి గురించి మాత్రం చెప్పలేని పరిస్థితి నెలకొని ఉంది. అలాగే ప్రతిపక్షాలు విధానపరమైన విమర్శలు చేస్తే వారిపై వ్యక్తిగత దూషణలతో ఎదురుదాడి చేయడమే వైసీపీ ప్రధాన అజెండాగా ఉంటుంది అనేది రాజకీయ వర్గాలలో పదే పదే వినిపించే మాట.
ఇదే వారిని ప్రజలకి దూరం చేస్తుంది అనే మాట కూడా బలంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ ఆలోచన విధానాలు అన్ని కూడా నియంతృత్వ ధోరణిలో ఉంటాయని ఆ పార్టీ నుంచి బయటకి వచ్చిన నేతలు అందరూ కూడా చేసే విమర్శలు. ఎంత పెద్దవాళ్ళు అయిన కూడా జగన్ దగ్గరకి వెళ్ళినపుడు నిలబడి మాట్లాడాల్సిందే అని చెబుతున్నారు. అలాగే అతన్ని సార్ అని పిలవాలని హుకుం జారీ చేస్తాడని కూడా చెబుతున్నారు.
అలాగే అభివృద్ధి గురించి కంటే జగన్ భజన చేయడమే వైసీపీలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ చేయాలని, అతను వానపాముని చూపించి నాగుపాము అనమంటే అందరూ అమ్మో పడగ ఎంత పెద్దగా ఉందో అనే రకం అని తాజాగా మాజీ వైసీపీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జగన్ తో మొదటి నుంచి వెంట ఉన్న అతను టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి చేరారు. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు. ఓ చానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన జగన్ వ్యవహార శైలిపై చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనంగా మారాయి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.