Venkatesh Maha: కేజీఎఫ్ 2పై విమర్శలు… దెబ్బకి సారీ చెప్పిన దర్శకుడు

Venkatesh Maha: కేజీఎఫ్ఫ్ చాప్టర్ 2 మూవీ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో ప్రతి సీన్ కూడా సినిమాటిక్ స్టాండర్డ్స్ లో లోతులని టచ్ చేస్తుంది అనేది చాలా మంది చెప్పే మాట. అయితే కొంత మంది మాత్రం కేజీఎఫ్ చాప్టర్ 2  ఒక పంక్తు కమర్షియల్ సినిమా అని విమర్శలు చేస్తూ ఉంటారు. కంటెంట్ లో దమ్ము లేకపోయిన కమర్షియల్ ఎలిమెంట్స్, హీరో ఎలిమెంట్స్ తో సినిమా నడిచేసింది అనేది వారి వాదన. అందులో భాగంగా తాజాగా టాలీవుడ్ దర్శకుడు వెంకటేష్ మహా కేజీఎఫ్ సిరీస్ లో రాఖీ భాయ్ పాత్రని విమర్శలు చేశారు. పాత్రపై చేసారనే కంటే ఆ ఐడియాని బిల్డ్ చేసిన ప్రశాంత్ నీల్ పైన అతను విమర్శలు చేసారని చెప్పొచ్చు.

అయితే ఈ మూవీలో రాఖీభాయ్ పాత్ర భాషలతో ప్రమేయం లేకుండా అందరికి నచ్చింది. ఇక కన్నడ ప్రేక్షకులు అయితే భాగా కనెక్ట్ అయిపోయారు. దీంతో వెంకటేష్ మహా కాస్తా పరుషంగా, వ్యంగ్యంగా రాఖీభాయ్ పాత్ర గురించి మాట్లాడటంతో అవి కాస్తా వైరల్ అయ్యాయి. దీంతో ట్విట్టర్ లో అతనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే అతని పేరు మీద హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేసి ట్రెండ్ చేశారు. అందులో మెజారిటీగా కన్నడ అభిమానులు అయితే వెంకటేష్ మహాని మీమ్స్ తో సహా వేసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న దర్శకులని కూడా ట్రోల్ చేశారు.

ఒకటి అర సినిమాలు చేసి అందులో చెత్త మూవీస్ చేసిన మీరు ఎలా టాలెంటెడ్ డైరెక్టర్స్ అయ్యారు అంటూ వారిపై విమర్శలు చేశారు. వెంకటేష్ మహా విమర్శలు చేసే సమయంలో వారందరూ కూడా నవ్వడం కూడా ఒక కారణం అని చెప్పాలి. ఇక ఆ ఇంటర్వ్యూ వీడియోకి కూడా స్ట్రైక్ లు కొట్టడం స్టార్ట్ చేశారు. అయితే దీనిపై దర్శకురాలు నందినిరెడ్డి ముందు రెస్పాండ్ అయ్యి సారీ చెప్పింది. దానికి ఎవరూ క్షమించలేదు.

ఇక తాజాగా దర్శకుడు వెంకటేష్ మహా ఒక వీడియో చేసి అందులో తన మాటలు కాస్తా శృతి మించి ఉన్నాయని తాను ఒప్పుకుంటున్నా అని చెప్పారు. అలాగే కొన్ని అసందర్భంగా మాట్లాడిన మాటలని కచ్చితంగా వెనక్కి తీసుకుంటున్నా అని పేర్కొన్నారు. అయితే తాను ఒక భాషకి సంబందించిన సినిమాపై విమర్శలు చేయలేదని, ఆ సినిమాపై తన అభిప్రాయం మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. తన అభిప్రాయానికి కట్టుబడి ఉంటూనే ఎక్స్ ప్రెస్ చేయడంలో జరిగిన పొరపాటుకి క్షమాపణలు కోరుతున్నట్లు పేర్కొన్నారు.

Varalakshmi

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

2 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

2 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.