Tollywood : పూరి జగన్నాథ్ హీరో ఎవరు..?

Tollywood : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కష్టాలు, సుఖాలు, కామెంట్స్, అప్రిసియేషన్స్..ఇలా అన్నీ ఎంజాయ్ చేసిన దర్శకుడు పూరి జగన్నాథ్. సూపర్ స్టార్ కృష్ణకి మాత్రమే డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అని పేరుండేది. ఆ తర్వాత ఏ హీరోను, దర్శకుడిని అలా డేరింగ్ అండ్ డాషింగ్ అని పిలవలేదు. అలా పిలిపించుకున్న దర్శకుడు మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్క పూరి జగన్నాథ్ మాత్రమే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన బద్రి సినిమాతో టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చారు పూరి.

tollywood-who is puri jagannath next hero

ఈ సినిమా మొదట ఫ్లాప్ అనే టాక్ వచ్చినా మెల్లగా ఆ టాక్ మారి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు రాబట్టి పవన్ కెరీర్‌లో ఓ మైల్ స్టోన్ మూవీలా నిలిచింది. ఆ తర్వాత వరుసగా హిట్స్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చేరారు. అయితే, పూరి కెరీర్‌లో సినిమాల ఫ్లాప్ కంటే కూడా ఆయన నమ్మిన వాళ్ళ వెన్నుపోటు గురించి ఎప్పుడూ మాట్లాడుకుంటుంటారు. ఓ దర్శకుడిగా సంపాదించిన 100 కోట్ల రూపాయలను పోగొట్టుకోవడం అంటే దీనిని పిచ్చో వెర్రో అమాయకత్వమో నిర్ణయించలేనిది.

Tollywood : విజయేంద్ర ప్రసాద్ మొబైల్ డీపీగా పూరి ఫొటో..

అన్నీ పోగొట్టుకొని రోడ్డుమీదకొచ్చిన వారెవరైనా పిచ్చోళ్ళవుతారంటే సందేహం లేదు. కానీ, పూరి సంపాదన..పేరును తలకెక్కించుకోరు. కొన్ని గంటలు బాధపడి ఓ సిగరెట్ తాగి రీచార్జ్ అయిపోతారు. అదే చేశారు. అప్పుడే ఆయన నుంచి మళ్ళీ బ్లాక్ బస్టర్స్ వచ్చాయి. పూరికి హిట్ ఫ్లాప్స్ సమానంగా ఉండొచ్చు. కానీ, ఇప్పటికీ ఆయన క్రేజ్ మాత్రం అలాగే ఉంది.

రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ లాంటి అగ్ర రచయిత, దర్శకుడు పాన్ ఇండియా స్థాయి సినిమాలను రూపొందించి దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకుకున్న కొడుకు రాజమౌళి ఫొటోను కూడా తన మొబైల్ డీపీగా పెట్టుకోకుండా పూరి ఫొటోను పెట్టుకోవడం అంటే ఎంతటి అభిమానమో అర్థమవుతుంది. పూరి హీరోలకి, తోటి దర్శకులకి ఓ వ్యసనం అని చెప్పక తప్పదు. అందరూ ఆయన ఉండాలని ట్రై చేస్తారు. కానీ అది అంత సులభం కాదు.

Tollywood : పూరి బయట హీరోలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు.

ఇంత పేరున్నాకూడా కొన్ని సందర్భాలలో చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకూ కథ వినడానికి మొహం చాటేస్తున్నారు. దీనికి కారణం పూరి తీస్తున్న రొటీన్ ఫార్ములా కథలే అని చెప్పక తప్పదు. ఇస్మార్ట్ శంకర్ తర్వాత బౌన్స్ బ్యాక్ అయిన పూరి, మళ్ళీ లైగర్ డిజాస్టర్‌తో అగాధంలోకి కూరుకుపోయారనే టాక్ వినిపిస్తోంది. ఇస్మార్ట్ శంకర్ తర్వాత దీనికి సీక్వెల్ అనుకున్నారు.

ఆ తర్వాత బాలయ్యతో సినిమా, మెగాస్టార్‌తో, మెహేష్ బాబుతో, రవితేజతో..ఇలా దాదాపు అందరు స్టార్స్‌తో పూరి ప్రాజెక్ట్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు పూరి హీరో ఎవరనేది డైలమాగా ఉంది. డ్రీమ్మ్ ప్రాజెక్ట్ జనగణమన కూడా ఆగిపోయింది. లైగర్ తర్వాత పూరీ ప్లాన్స్ అన్నీ తారుమారయ్యాయని చెప్పుకుంటున్నారు. అయితే, పూరి బయట హీరోలను వెతుక్కోవాల్సిన అవసరం లేదు. సరిగ్గా దృష్టిపెడితే కొడుకు చాలు. అప్పట్లో పూరి ఫ్లాప్స్‌లో ఉండే తమ్ముడు సాయి రామ్ శంకర్‌ను హీరోగా పరిచయం చేసి 143 మూవీతో బౌన్స్ బ్యాక్ అయ్యారు. అలాగే, ఓ లుక్ కొడుకుపై వేస్తే ఇంకో హీరో అవసరం లేదు అనుకోవచ్చు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.