Wed. Jan 21st, 2026

    AP BJP: ఏపీలో బీజేపీ పార్టీని సంస్థాగతంగా బలపరిచే దిశగా కేంద్రంలోని పెద్దలు అడుగులు వేస్తున్నారు.  జనసేనతో పొత్తు పెట్టుకోవడం ద్వారా ఏపీలో బలపడాలని ప్రయత్నం చేసిన ఆ పార్టీకి ఆశించిన స్థాయిలో ఎదుగుదల కనిపించడం లేదు.  జనసేనాని ఎన్నికలు సమీపంలో బీజేపీకి హ్యాండి ఇచ్చి టీడీపీ దోస్తీ కట్టడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం ప్రస్తుతం నడుస్తుంది. ఈ నేపధ్యంలో బీజేపీ ఒంటరిగానే ఏపీలో ఎదగాలని ప్రయత్నాలు చేస్తుంది. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. తెలంగాణలో ఇప్పటికే బీజేపీ బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉంది. వచ్చే ఎన్నికలలో గెలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి.  ఈ నేపధ్యంలో ఏపీలో కూడా బలమైన నాయకులని బీజేపీ రెడీ చేసుకుంది.

    Nallari in BJP: కమల దళంలోకి నల్లారి.. మాజీ సీఎంను పార్టీలో చేర్చుకోవడం  వెనుక బీజేపీ పెద్దల వ్యూహం ఇదేనా..? | Is this the BJP high command's  strategy behind the inclusion of ...

    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నారు. సమైఖ్యాంద్ర అనే పార్టీ పెట్టారు. అయితే దాని ప్రభావం ఏమీ కనిపించలేదు. తరువాత కాంగ్రెస్ గూటికి మళ్ళీ వెళ్ళిపోయారు. అయితే కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యుత్వానికి ఆయన రాజీనామా చేశారు. తాజాగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.  కేంద్రంలోని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి కీలక పదవి ఇచ్చేందుకు బీజేపీ రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే బీజేపీలో చేరిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

     

    కాంగ్రెస్ పార్టీని వీడుతానని తాను ఎప్పుడు అనుకోలేదు. అయితే కేంద్రంలోని కాంగ్రెస్ పెద్దలు రాష్ట్ర విభజన సమయంలో ఏ ఒక్కరితో కూడా సంప్రదించకుండా నిర్ణయాలు తీసుకున్నారు. కాంగ్రెస్ పెద్దలు ప్రతి సారి కూడా రాష్ట్ర నాయకులకి గౌరవం ఇవ్వైవ్వలేదు. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నష్టపోయింది.  కాంగ్రెస్ పార్టీ జబ్బుకి మందు కనుక్కునే ప్రయత్నం చేయలేదు. పొరపాట్లు చేస్తూనే ఉంది అని పేర్కొన్నారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి చేరికతో ఏపీలో బీజేపీ బలం పెరిగింది అని చెప్పాలి. రానున్న ఎన్నికలలో కచ్చితంగా బీజేపీకి ఇది లాభించే అంశం అని చెప్పాలి. అలాగే జనసేన కూడా బీజేపీతో పొత్తు విషయంలో పునరాలోచన చేసుకునే అవకాశం ఉందని చెప్పాలి.