Categories: LatestNewsPolitics

Pawan Kalyan: సలహాలిచ్చే వారు ఎక్కువైపోయారు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ప్రయాణం చేస్తున్నారు. వైసీపీని గద్దె దించే దిశగా బలమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ రాజకీయ వ్యూహాలలో భాగంగా ఈ సారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్లాలని జనసేనాని భావిస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా అధికార పార్టీ వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతుంది అని చెప్పొచ్చు. ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జనసేనాని ఓటుబ్యాంకు పెరిగింది. అలాగే  వైసీపీ వ్యతిరేక ఓటు శాతం కూడా పెరిగింది. టీడీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. దీంతో రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ కలయిక వైసీపీకి పెను ప్రమాదం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎలా అయిన వారిద్దరి బంధాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.

అయితే వైసీపీతో పని కావడం లేదని డిసైడ్ అయిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు స్టాండ్ మార్చినట్లు తెలుస్తోంది. మేధావులు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరి బిక్షతోనో ముఖ్యమంత్రి కారని, తాను అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడున్న స్పేస్ లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ప్రజలకి కనిపిస్తున్నారని, దానికి కరెక్ట్ గా వాడుకుంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. వైసీపీ సపోర్టర్స్ గా ముద్ర పడిపోయిన ఆర్జీవీ అయితే పవన్ కళ్యాణ్ ఆ పార్టీ మీద చేసే కామెంట్స్ కి వైసీపీ కార్యకర్తల కంటే ముందుగా రియాక్ట్ అవుతూ ఉండటం విశేషం.

అలాగే తమ్మారెడ్డి భరద్వాజ కూడా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి బలమైన శక్తిగా ఎదగాలంటూ సూచనలు చేస్తున్నారు.ముఖ్యంగా వీరి అజెండా అంతా జనసేనకి సపోర్ట్ గా నిలిచే క్యాడర్ లో, నాయకులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ పార్టీకి దూరం చేయడమే అని తెలుస్తోంది. మరి మొన్నటి వరకు తిట్టి ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్న మేధావుల మాటలని వినను అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. మరి వారి మిగిలిన క్యాడర్ ని ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది చూడాలి.

Varalakshmi

Recent Posts

ALLU ARJUN: AA22 టైటిల్ “రాకా”..ఇది ఎవరూ ఊహించనిది!

ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…

4 days ago

Ram Charan: ‘పెద్ది’ కథకి స్పూర్తి ఆమిర్ ఖాన్ సినిమాలేనా?

Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్‌తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…

6 days ago

Chiranjeevi: విశ్వంభర మరింత ఆలస్యం..ఆ సినిమాలా అవుతుందా?

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఆ తర్వాత వచ్చిన హీరోలందరికీ ఒక ఇన్‌స్పిరేషన్. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు నడుస్తున్న…

6 days ago

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు

Sai Durgha Tej: సొంత బ్యానర్‌ను ప్రారంభించిన మెగా మేనల్లుడు. ఆయనెవరో సాయి దుర్గా తేజ్ (సాయి ధరమ్ తేజ్).…

1 week ago

Peddi Movie: పెద్ది రిలీజ్ విషయంలో రామ్ చరణ్ చెప్పినా నమ్మని ఫ్యాన్స్!?

Peddi Movie: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా పెద్ది. పాన్ ఇండియా వైడ్‌గా ఏప్రిల్ 30న…

1 week ago

Carmeni Selvam (2026) – Movie Review: కార్మేని సెల్వం బ్యూటిఫుల్ ఎమోషన్స్, ఫ్యామిలీ రిలేషన్స్‌తో సాగిన చక్కటి కుటుంబకథా చిత్రం

Carmeni Selvam (2026) - Movie Reviews: పాత్‌వే ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అరుణ్ రంగరాజులు నిర్మాతగా రామ్ చక్రి దర్శకత్వంలో…

1 week ago

This website uses cookies.