Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో చురుకుగా ప్రయాణం చేస్తున్నారు. వైసీపీని గద్దె దించే దిశగా బలమైన వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఈ రాజకీయ వ్యూహాలలో భాగంగా ఈ సారి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని ఎన్నికలకి వెళ్లాలని జనసేనాని భావిస్తున్నారు. అదే జరిగితే కచ్చితంగా అధికార పార్టీ వైసీపీకి గట్టి పోటీ ఎదురవుతుంది అని చెప్పొచ్చు. ఓడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం జనసేనాని ఓటుబ్యాంకు పెరిగింది. అలాగే వైసీపీ వ్యతిరేక ఓటు శాతం కూడా పెరిగింది. టీడీపీ ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదు. దీంతో రానున్న ఎన్నికలలో జనసేన, టీడీపీ కలయిక వైసీపీకి పెను ప్రమాదం అని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఎలా అయిన వారిద్దరి బంధాన్ని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు.
అయితే వైసీపీతో పని కావడం లేదని డిసైడ్ అయిన ఆ పార్టీ నాయకులు ఇప్పుడు స్టాండ్ మార్చినట్లు తెలుస్తోంది. మేధావులు, రాజకీయ విశ్లేషకుల ముసుగులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవరి బిక్షతోనో ముఖ్యమంత్రి కారని, తాను అనుకుంటే ముఖ్యమంత్రి అవుతారని సలహాలు ఇస్తున్నారు. ఇప్పుడున్న స్పేస్ లో టీడీపీకి ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ ప్రజలకి కనిపిస్తున్నారని, దానికి కరెక్ట్ గా వాడుకుంటే ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ చెప్పుకొస్తున్నారు. వైసీపీ సపోర్టర్స్ గా ముద్ర పడిపోయిన ఆర్జీవీ అయితే పవన్ కళ్యాణ్ ఆ పార్టీ మీద చేసే కామెంట్స్ కి వైసీపీ కార్యకర్తల కంటే ముందుగా రియాక్ట్ అవుతూ ఉండటం విశేషం.
అలాగే తమ్మారెడ్డి భరద్వాజ కూడా పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసి బలమైన శక్తిగా ఎదగాలంటూ సూచనలు చేస్తున్నారు.ముఖ్యంగా వీరి అజెండా అంతా జనసేనకి సపోర్ట్ గా నిలిచే క్యాడర్ లో, నాయకులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి ఆ పార్టీకి దూరం చేయడమే అని తెలుస్తోంది. మరి మొన్నటి వరకు తిట్టి ఇప్పుడు ఉచిత సలహాలు ఇస్తున్న మేధావుల మాటలని వినను అని ఇప్పటికే పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. మరి వారి మిగిలిన క్యాడర్ ని ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది చూడాలి.