Wed. Jan 21st, 2026

    AP Politics: ఏపీలో అధికార పార్టీ వైసిపి ఓవైపు వచ్చే ఎన్నికలలో భారీ మెజార్టీతో గెలవడానికి ప్రచార వ్యూహాలు సిద్ధం చేసుకుని ప్రజాక్షేత్రంలోకి వెళ్తుంది. తాము ప్రజలకు సంక్షేమ పథకాలతో ఇస్తున్న డబ్బులు మరలా తమకు ఓట్లు తీసుకువస్తాయని ముఖ్యమంత్రి జగన్ భావిస్తున్నారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువగా ఇబ్బందులు పడుతుంది మాత్రం ఉద్యోగులని చెప్పాలి. అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ రద్దు చేస్తామంటూ ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. ఇక గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. ఇక ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడం కూడా కష్టమయ్యే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో ఉంది.

    AP Employees: ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమవుతోన్న ఏపీ  ఉద్యోగులు.. రాజీ ప్రసక్తే లేదని స్పష్టం.. | AP Employees Union getting  ready for fight with ...

    డేట్ తో సంబంధం లేకుండా ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తూ ఉన్నారు. దీనిపై చాలా రోజులు నుంచి ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం జీతాలు పెంచుతారని ఆలోచన కూడా ఇప్పుడు వారికి లేదు. ఒకటో తేదీకి జీతాలు ఇస్తే చాలు అనుకునే పరిస్థితి నెలకొంది. ఓ విధంగా చెప్పాలంటే ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొని ఉందని చెప్పాలి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జేఏసీ ఉద్యమ కార్యాచరణ సిద్ధం చేసుకుని ప్రభుత్వంపై జీతల విషయంలో ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అయితే అధికార పార్టీ మాత్రం ఉద్యోగుల ఆందోళన అస్సలు లెక్క చేయలేదని చెప్పాలి.

    Employees assn demands salaries on 1st of every month

    తాజాగా ఉద్యోగుల సంఘం నేత బొప్పరాజు మరోసారి ఏపీ ప్రభుత్వానికి మార్నింగ్ ఇచ్చారు. ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. వచ్చే నెలలో సిపిఎస్ రద్దు కోసం నిర్వహించే ఉప్పెన ఉద్యమంలో ఉద్యోగులందరూ కూడా పాల్గొంటారని బొప్పరాజు పేర్కొన్నారు. ఉద్యోగులు వైసీపీ సర్కారుపై ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేయనున్నట్లుగా పేర్కొన్నారు. ఓ వైపు వైసీపీ సర్కార్ ప్రజల్లోకి జగనన్నే మా భవిష్యత్తు అంటూ బలవంతంగా చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉండగా మరో వైపు ఉద్యోగులు మాత్రం మా జీతాలు మాకు ఇవ్వండి, సీపీఎస్ రద్దు చేయండి అంటూ ఉద్యమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పుడు వైసీపీకి ఉద్యోగుల ఆందోళన పెద్ద తలనొప్పి అని చెప్పాలి