Technology: ప్రముఖ వ్యాపార వేత్త ఎలాన్ మాస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో యుగంలో ట్విట్టర్, పేస్ బుక్ అతిపెద్ద సామాజిక మాధ్యమాలుగా ప్రజలకి చేరువగా ఉన్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు, వ్యాపారుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ తన వాయిస్ ని ప్రజలకి వినిపించేందుకు పేస్ బుక్ గతంలో ఉపయోగించేవారు. అయితే పేస్ బుక్ లో భద్రత ప్రమాణాలు తక్కువగా ఉండటంతో ట్విట్టర్ లోకి చాలా మంది సెలబ్రెటీలు షిఫ్ట్ అయిపోయారు.
ట్విట్టర్ ద్వారా సెలబ్రెటీలు అందరూ ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటున్నారు. అలాగే వ్యాపారులు తమ ఉత్పత్తులని ప్రమోట్ చేసుకోవడానికి, రాజకీయ నాయకులు తమ స్వరాన్ని ప్రజలకి చేరవేయడానికి ట్విట్టర్ ని ప్రధాన మాధ్యమంగా చేసుకుంటున్నారు. ప్రస్తుతం దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ట్విట్టర్ వన్ సోషల్ మీడియా వేదికగా మారిపోయింది. రాజకీయ పార్టీలు ట్విట్టర్ ని తమ ప్రచార అస్త్రంగా వాడుకుంటున్నాయి. సెలబ్రెటీలని, రాజకీయ,.వ్యాపార దిగ్గజాలు ట్విట్టర్ లో తమ అఫీషియల్ ప్రొఫైల్ కోసం బ్లూ టిక్ మెయింటేన్ చేస్తున్నాయి.
రెండు నెలల పే ఆఫ్ ఇచ్చేసి వారిని ఇంటికి పంపించేస్తున్నారు. అలాగే కొన్ని ప్రధాన కార్యాలయాలని మూసేస్తున్నారు. కొన్ని భద్రతాపరమైన మార్పులలో భాగంగా మోసేస్తున్నట్లు ఉద్యోగులకి మెయిల్స్ పంపిస్తున్నారు. మరో వైపు ట్విట్టర్ ని టేకోవర్ చేసిన ఎలాన్ మాస్క్ తాను పెట్టిన పెట్టుబడిని వడ్డీతో సహా వసూలు చేయడానికి రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇకపై బ్లూ టిక్ మార్క్ కావాలంటే కచ్చితంగా డబ్బులు చెల్లించాలనే నిబంధనని తీసుకొచ్చారు. బ్లూ టిక్ మార్క్ కోసం 8 డాలర్ల రుసుము నిర్ణయించారు.
ఇక ఈ బ్లూ టిక్ మార్క్ ని ఎక్కువగా సెలబ్రెటీ ప్రముఖులు మాత్రమే ఉపయోగిస్తారు కాబట్టి వారికి ఇది పెద్ద మొత్తం కాదు. ఇక ఈ బ్లూ టిక్ మార్క్ ద్వారా ప్రతి నెల 29 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే భవిష్యత్తులో క్యాంపైన్స్ కోసం కూడా ప్రత్యేకమైన రుసుముని నిర్ణయించేందుకు ఎలాన్ మాస్క్ సిద్ధం అవుతున్నారని కార్పొరేట్ వర్గాలలో వినిపిస్తుంది. ట్విట్టర్ వినియోగాన్ని ఎలాన్ మాస్క్ కాస్ట్లీ వ్యవహారంగా మార్చడం వలన భవిష్యత్తులో దీనిని యూజర్స్ తగ్గిపోయే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.