Egg: ప్రతిరోజు గుడ్డును ఆహారంగా తీసుకుంటే మన శరీరానికి అవసరమైన విటమిన్స్ ,మినరల్స్ ,ప్రోటీన్స్ సమృద్ధిగా లభిస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో చాలా మంది గుడ్డులోని పచ్చసొన భాగాన్ని పక్కన పెట్టేస్తున్నారు. దీనికి కారణం గుడ్డు పచ్చసొనలో అధిక మొత్తంలో కొలెస్ట్రాల్ ఉంటుందని దీన్ని ఆహారంగా తీసుకుంటే మన శరీరంలో కొలెస్ట్రాల్ శాతం పెరిగి ఉబకాయం,గుండె జబ్బులు వంటి వస్తాయని చెబుతున్నారు. ఇది అపోహ మాత్రమే.
గుడ్డు పచ్చసొనలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న మాట వాస్తవమే అయినప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని వైద్య నిపుణులు ఇప్పటికే స్పష్టం చేశారు. వైద్యుల సూచనల ప్రకారం గుడ్డు మొత్తాన్ని ఆహారంగా తీసుకుంటేనే మన శరీరానికి అవసరమైన అన్ని పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. ముఖ్యంగా పచ్చ సోనాలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ బి1, బీ 2, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంటూ, ప్రోటీన్స్, మినరల్స్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం ఫైబర్ వంటి ఖనిజలవనాలు అధిక మొత్తంలో లభిస్తాయి.
అయితే ఒకేరోజులో ఎక్కువ గుడ్లను తినడం మన ఆరోగ్యానికి హానికరమని వైద్యులు కూడా చెప్తున్నారు. ఈ ఒక్క నియమం పాటిస్తే సరిపోతుంది.ఉడకబెట్టిన గుడ్డు మొత్తం ఆహారంగా తీసుకుంటే ముఖ్యంగా చిన్నపిల్లల్లో శారీరక, మానసిక ఎదుగుదల సక్రమంగా జరిగింది సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. గుడ్డులోని పచ్చసొనలో ఉండే ఐరన్ మన శరీరం తేలికగా గ్రహించడం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరిగి ప్రమాదకర ఎనిమీయ వ్యాధి నుంచి తప్పించుకోవచ్చు. ఇలా పచ్చ సొన తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కనుక ఇకపై ఎవరూ కూడా వీటిని పడేయకుండా తినడం ఎంతో మంచిది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.