Technology: ప్రస్తుతం మనం కంప్యూటర్ కాలంలో బ్రతుకుతున్నాము. నిద్ర లేచిన దగ్గర్నుంచీ పడుకునే వరకు నూటికి తొంబై శాతం గాడ్జెట్ వాడకంతోనే రోజు గడిచిపోతుంది. ఉద్యోగం చేసేవారు..చదువుకునేవారు..వ్యాపారం చేసుకునే వారు.. ఇలా చాలా పరిశ్రమలలో గాడ్జెట్స్ వాడకమే ఎక్కువగా ఉంటుంది. ఏ పని లేని వారు కూడా సరదాగా కాసేపు మొబైల్ ఫోన్ తీసుకొని చాటింగ్, సాంగ్స్ ఇతర ప్రోగ్రాంస్, ఆన్‌లైన్ షాపింగ్ అంటూ సమయం కేటాయిస్తున్నారు. గాడ్జెట్స్ అంటే ఒక్క మొబైల్ ఫోన్ మాత్రమే కాదు, కాస్త స్క్రీన్ పెద్దగా ఉన్న ట్యాబ్స్, డెస్క్ టాప్స్, ల్యాప్‌టాప్స్, టీవీలు, సెన్సార్ వగైరా కలిసి గాడ్జెట్స్ అంటాము.
సాధారణంగా కంప్యూటర్ లేదా ల్యాప్‌టాప్ వాడుతున్న వారిలో ఎక్కువగా మెడ (నెక్) నొప్పి, బ్యాక్ (వెన్నుముక) పేయిన్ వస్తున్నాయి. అధికశాతం ఆఫీసులో గంటల కొద్దీ కూర్చొని పని చేసే వారిలో విద్యార్థుల్లో..బస్ డ్రైవర్స్..ఇలా ఎక్కువ గంటలు కూర్చొని పనిచేస్తున్న వారికి ఈ సమస్యలు తప్పడం లేదు. ఇక టెక్నాలజీ ఎంత పెరిగిందో మానవుల్లో అన్ని రకాల జబ్బులు పెరుగుతున్నాయి. ఎక్కువగా సెల్‌ఫోన్ వాడకం వల్ల చిన్న పిల్లల దగ్గర్నుంచీ పెద్ద వారి వరకు అనేక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు.
ఇప్పుడు ఎక్కువగా మొబైల్ వాడుతుంది చిన్న పిల్లలే అని చెప్పక తప్పదు. ఒకప్పుడు అన్నం తిననని మారాం చేస్తే ఆరుబయట చందమామను చూపిస్తూ ఏవో కబుర్లు చెబుతూ అన్నం పెట్టేవారు. కానీ, ఇప్పుడు సెల్ ఫోన్‌లో ఏవో కథలు, కార్టూన్ బొమ్మలు వంటివి చూపించి తినిపిస్తున్నారు. పని ఒత్తిడి వల్ల ఇంట్లో పనులు కావడం లేదనే కారణంతో ఓ పాడైన సెల్ ఫోన్ పిల్లల చేతికిచ్చేస్తున్నారు. అలా చిన్న పిల్లలు సెల్ ఫోన్ అలవాటు కావడంతో 20 శాతం నిద్ర తగ్గిపోతుందని నివేదికలు చెబుతున్నాయి.
ఇక 12 ఏళ్ళ పిల్లలలో రక రకాల థ్రిల్లర్, మర్డర్ వీడియోస్ లాంటివి చూడటం వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఇలాంటి సమయంలోనే మొబైల్‌లో చూసిన వీడియోలను గుర్తు చేసుకొని సూసైడ్ చేసుకోనేలా ప్రేరేపితం అవుతున్నారు. ఇది ముమ్మాటికీ టెక్నాలజీ ఎక్కువగా ఉపయోగించడం వల్ల జరిగే అనర్థాలే. ఇక విద్యార్థుల్లో లర్నింగ్ ఎబిలిటీ బాగా తగ్గిపోవడానికి కూడా గాడ్జెట్ కారణం అవుతున్నాయి. ఆన్‌లైన్ క్లాసెస్ అని గాడ్జెట్స్‌లో వీడియోస్ చూడటం దానికి కాకుండా మిగతా విషయాలకు అడిక్ట్ అవడం వల్ల మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా పెరుగుతోంది. ఆ ప్రభావం చదువు మీద పడి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కూడా యావరేజ్ స్టూడెంట్‌గా తయారవుతున్నాడు.
ఇక కొత్తగా పెళ్ళైన వారిలో ఎక్కువగా చాలా మంది ఏకాంతంగా గడపాలని చేతిలో సెల్ ఫోన్ తప్ప పక్కన తోడు ఉండాలని కోరిక తగ్గి దీనివల్ల మనస్పర్థలు వచ్చి ఏకంగా విడాకులు తీసుకునే స్థాయికి వెళుతున్నారు. ఇలా గాడ్జెట్స్ కారణంగా విడాకులు తీసుకుంటున్న జంటలు దాదాపు ముప్పై నుంచి నలభై శాతం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే ప్రతీ 10 మందిలో 7 మంది సెల్ స్మార్ట్ ఫోన్స్ వాడుతున్నారట. రోజులో రెండు గంటలకు మించి సెల్‌ఫోన్ స్క్రీన్ చూస్తే 100లో కనీసం 30 నుంచి 40 మంది వరకు నిద్ర లేమి సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
ముఖ్యంగా పడుకునే ముందు సెల్ ఫోన్ చూడటం వల్ల లైట్ కంటి మీద పడి మెలటోనిన్ హార్మోన్ నిద్రహారిస్తుంది. అది రిలీజ్ కాక నిద్ర లేమి సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా మితంగానే ఉపయోగించాలి. లేదంటే మనలో కొత్త కొత్త ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే అందరూ అదుపులో టెక్నాలజీని పెట్టుకొని ఆరోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.