Categories: Tips

Health: వేసవిలో మామిడి పండ్లు టేస్ట్ చేయాల్సిందే… ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా?

Health: వేసవి వచ్చింది అంటే  మామిడి పండ్ల సీజన్ మొదలవుతుంది. పల్లెల నుంచి పట్టణాల వరకు ప్రతి చోట మామిడి పండ్లు విరివిగా లభిస్తూ ఉంటాయి. పూర్వం రోజులలో పల్లెల్లో మామిడి తోటల వేసవి సీజన్ లో లభించే మామిడి పండ్ల ని కుటుంబం మొత్తం తినేవారు. అయితే ఇప్పుడు మామిడి పండ్ల వ్యాపారం అనేది ఒక లాభసాటి వ్యాపారాలలో ఒకటిగా మారింది.

ఈ  కారణంగా రైతులు ఇతర వ్యవసాయాల కంటే తమ భూమిలో మామిడి మొక్కలు వేసి సీజనల్ గా వచ్చే మామిడి పండ్లని అమ్ముకొని దానితో ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు. అయితే అన్ని సమయాలలో ఈ మామిడి పండ్ల వ్యాపారం రైతులకి కలిసి రాదు. మామిడి కాయలు చేతికి వచ్చే సమయానికి తుఫాన్ లు వంటివి వస్తే పంట పూర్తిగా నాశనం అయ్యే అవకాశం ఉంది. అయితే ఏ సీజన్ లో అయిన సిటీలలో మామిడి పండ్లు కిలో వంద రూపాయిల వరకు ధర పలుకుతుంది. చాలా మంది వేసవికాలంలో కొనుక్కొని ఇష్టంగా తింటారు.

benefits-of-mango-fruit

అయితే మామిడి పండ్లు ఎక్కువగా తింటే వేడి చేస్తుందని, శరీరంలో ఇన్ఫెక్షన్ కురుపులు వస్తాయని చాలా మంది భావిస్తూ ఉంటారు. అయితే ఈ మామిడి పండ్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. పండ్లలో మామిడిని రారాజుగా పిలుస్తారు. వీటిలో విటమిన్స్, మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. మామిడి పండ్లలో ముఖ్యంగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ విధానాన్ని మెరుగుపరిచి ఆహారం తొందరగా జీర్ణం అవడానికి ఉపయోగపడుతుంది.

అలాగే వీటిలో ఉండే గ్లైసెమిక్స్ ఇండెక్స్ కారణంగా షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. విటమిన్ సి కూడా ఉండటం వలన కొలెస్టరాల్ ని నియంత్రిస్తుంది. అలాగే క్యాన్సర్ కారకాలని మామిడి పండ్లు ఎదుర్కోవడంతో పాటు ప్రోటో క్యాన్సర్ ఆంకోజీన్స్ ని నివారించే సామర్ధ్యం ఎక్కువగా ఉంటుంది. అలాగే లుకేమియాని ఎదుర్కొనే శక్తి మామిడి పండ్లకి ఉంటుంది. అలాగే మామిడి పండ్లు తినడం వలన దంత సమస్య దూరం అవుతుంది. నోట్లో ఉండే బాక్టీరియాని నాశనం చేసే లక్షణం ఈ పండ్లకి ఉంది. ఎలాంటి పంటి సమస్యలు ఉన్నవారైనా మామిడి పండ్లు తింటే ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

అలాగే వీటిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం చాలా వరకు మామిడి పండ్లని కెమికల్స్ వేసి మగ్గిస్తున్నారు. వీటిని తినడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు సరికదా కొత్త జబ్బుల్ని ఆహ్వానించినట్లు అవుతుంది. సహజసిద్ధంగా మగ్గించిన మామిడి పండ్లలో మాత్రమే ఔషధ గుణాలు అన్ని ఉంటాయని నిపుణుల మాట.

Varalakshmi

Recent Posts

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

2 weeks ago

Sai Gangula: న్యూజెర్సీ తెలుగు సమాజానికి నాట్స్ కొత్త నాయకత్వం – చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల నియామకం

Sai Gangula: న్యూజెర్సీలోని తెలుగు సమాజానికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) కొత్త నాయకత్వాన్ని ప్రకటించింది. నాట్స్ న్యూజెర్సీ…

3 weeks ago

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 month ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 month ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

2 months ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

2 months ago

This website uses cookies.