Categories: Tips

Technology: పిల్లల భద్రతకి ముప్పుగా మారిన లెర్నింగ్ యాప్స్… ఏం జరుగుతుందో తెలుసా

Technology: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడిపోయారు. అలాగే విద్యార్థుల చదువులు కూడా తరగతి గదుల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేశాయి. ప్రయివేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వం పాఠశాలల వరకు విద్యార్థులు పూర్తిగా చదువులకి దూరం కాకుండా ఆన్ లైన్  క్లాస్ లు చెప్పడం స్టార్ట్ చేశాయి. అలాగే పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ క్లాస్ ని చెప్పే యాప్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి.

అలాగే కంపెనీల అంతర్గత మీటింగ్స్ కోసం రూపొందించిన జూమ్, గూగుల్ మీట్ వంటివి ఆన్ లైన్ తరగతులు చెప్పడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఈ పద్ధతి వలన మరింత అడ్వాన్స్ గా విద్యార్ధులకి చదువులు అందుతున్నాయి. అంత వరకు బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీ మాటున చాలా కంపెనీలు ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వ్యక్తిగత డేటాని అడ్వార్టైజింగ్ కంపెనలకి  అమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాస్ ల కోసం విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది.

remote-learning-apps-tracked-millions-of-kids-around-the-world

అయితే ఈ వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఆయా కంపెనీలు హామీ ఇస్తాయి. అయితే ఈ హామీని అతిక్రమిస్తూ ఇప్పుడు విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో పేర్కొన్నాయి. ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ లు, పిల్లల డేటాని అనుమతి లేకుండా సేకరిస్తూ థర్డ్ పార్టీ కంపెనీలకి విక్రయిస్తున్నట్లు వారు కనుగొన్నారు. ఈ సంస్థ 49 దేశాలలో 150 కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టెక్నీకల్ ఉత్పత్తులని పరిశీలించాయి. వీటిలో 89 శాతం ఉత్పత్తులు పిల్లల డేటాని తస్కరిస్తున్నట్లు గుర్తించారు. చాలా ఎడ్యుకేషన్ టెక్ ఉత్పత్తులు పిల్లల సామర్ధ్యానికి పర్యవేక్షించడానికి ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి.

ఈ టెక్నాలజీ సాయంతో విద్యార్థుల డేటాని యాప్స్ లో స్టార్ట్ చేసిన తర్వాత వాటిని తీసుకొని థర్డ్ పార్టీ కంపెనీలకి విక్రయిస్తున్నాయి. ఇలా డేటాని 196 థర్డ్ పార్టీ కంపెనీలకి పంపుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే చాలా యాప్స్ పర్సనల్ డేటాని ట్రాకింగ్ చేస్తూ తస్కరించి థర్డ్ పార్టీ కంపెనీలకి అమ్ముకుంటున్నాయని టాక్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ టెక్ ఉత్పత్తులు కూడా ఇలాంటి అతిక్రమణలకి పాల్పడుతూ పిల్లల వ్యక్తిగత భద్రతకి కూడా విఘాతం కలిగిస్తున్నాయని ఈ నివేదిక బట్టి తెలుస్తుంది.

Varalakshmi

Recent Posts

Manisha Koirala : ఆ సీన్ కోసం 12 గంటలకు పైగా బుర‌ద‌లో ఉన్న

Manisha Koirala : బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తెర‌కెక్కించిన 'హీరామండి' వెబ్ సిరీస్ ఓటీటీలో దూసుకుపోతోంది.…

21 hours ago

Allu Arjun : నాకు రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అస్సలు లేదు

Allu Arjun : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. నగరాల నుంచి గ్రామాల వరకు అన్ని చోట్ల…

22 hours ago

Marriage: పెళ్లికి ఆలస్యం అవుతుందా.. గంగా సప్తమి రోజు ఇలా చేస్తే చాలు?

Marriage: గంగా సప్తమి గంగాదేవికి ఎంతో కీలకమైనదని చెప్పాలి. ఈ గంగ సప్తమినీ ప్రతి ఏడాది వైశాఖ మాసంలోని శుక్ల…

2 days ago

Food Eating: రాత్రి 9 తరువాత భోజనం చేస్తున్నారా… ప్రమాదంలో పడినట్టే?

Food Eating: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ఎవరు కూడా సరైన సమయానికి భోజనం చేయడం లేదు భోజన సమయం…

2 days ago

Mangoes: మామిడికాయలను కడగకుండా అలాగే తింటున్నారా.. ఇది తెలుసుకోవాల్సిందే!

Mangoes: వేసవికాలం వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరు కూడా మామిడి పండ్లను తినడానికి ఎంతో ఇష్టపడుతూ ఉంటారు మార్కెట్లోకి కూడా…

2 days ago

Vastu tips: ఉదయం నిద్ర లేవగానే ఇవి చూస్తే చాలు అమ్మవారి అనుగ్రహం మన పైనే?

Vastu tips: సాధారణంగా మనం మన హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఎన్నో ఆచారాలు వ్యవహారాలను పాటిస్తూ ఉంటాము. అయితే…

2 days ago

This website uses cookies.